IT Raids: హైదరాబాద్ లో మరోసారి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ నిర్వహిస్తుంది.
Road Accidents: ఇండియాలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం, చాలా సందర్భాల్లో రోడ్ల పరిస్థితులు సరిగా లేకపోవడం, ఓవర్ స్పీడ్, వాహనదారుల అజాగ్రత్త ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా రోడ్లను పట్టించుకోకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. తాజాగా రోడ్డు రవాణా మంత్రి శాఖ వెల్లడించిన నివేదికలో ఇండియా వ్యాప్తంగా 2022లో రోడ్డు ప్రమాదాలు పెరిగినట్లు తేలింది.
Indian Racing League: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఇక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలు వాయిదా పడడం లేదా ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం జరుగుతోంది.
ఏపీ హైకోర్టు ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు అని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు. దీని వల్ల పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ ఆయన కలవరు అని అచ్చెన్న పేర్కొన్నారు.
కత్తిపోట్లకు గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యులను అడిగి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులిటెన్ ను యశోదా ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. కత్తి గాయాలతో కొత్త ప్రభాకర్ రెడ్డి మా ఆస్పత్రికి తీసుకొచ్చారు..CT స్కాన్ చేశాం.. చిన్న పేగుకి 4 చోట్ల రంధ్రాలు పడ్డాయి.. చిన్న పేగు 15 సెంటీ మీటర్ల మేర కట్ చేసి సర్జరీ చేశామని డాక్టర్లు వెల్లడించారు.
తెలంగాణలో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించారు. 43 మందితో బీఎస్పీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్ చేశారు.