Koti Deepotsavam 2023 Day 14: కార్తిక మాసంలో ప్రతీ ఏడాది ఎన్టీవీ, భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం చివరి రోజుకు చేరింది.. నవంబర్ 14వ తేదీ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తోన్న దీప యజ్ఞం కోటి దీపోత్సవం ఇవాళ్టితో ముగియనుంది.. దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాల నుంచి దేవతామూర్తులను వేదికపై నెలకొల్పి కల్యాణాలు నిర్వహించారు.. ప్రసిద్ధ పండితుల ప్రవచనాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణ, అతిరథ మహారథులు అతిథులుగా వచ్చేశారు.. ఇక, ఈ ఏటి ఉత్సవం నేటితో పరిసమాప్తం కానుంది.. చివరి రోజు కోటిదీపోత్సవానికి కొత్త శోభ చేకూరనుంది.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు కోటిదీపోత్సవంలో పాల్గొనబోతున్నారు. ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని.. తెలంగాణకు రానున్న ఆయన.. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇక, రాత్రికి కోటి దీపోత్సవంలో పాల్గొంటారు.
కోటిదీపోత్సవంలో చివరి రోజు విశేష కార్యక్రమాలు ఇవే..
* కోటిదీపాల సంబరంలో చివరిఘట్టం
* కోటి దీపోత్సవ ఘట్టంలో అపూర్వఘట్టం.. నేడు ముఖ్యఅతిథిగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ
* కార్తిక సోమవారం సహిత పూర్ణిమ సందర్భంగా పున్నమి కాంతుల్లో శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం
* తిరుమలేశుని కల్యాణం
* భద్రాద్రి రామచంద్రుని వైభవం
* స్వర్ణ లింగోద్భవ కాంతులు
* సప్తహారతుల వెలుగులు
* మహా నీరాజనాలు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభం కానున్న దీపయజ్ఞానికి సాదరంగా ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువలను రచనా టెలివిజన్ పక్షాన పూర్తి ఉచితంగా అందిస్తోన్న విషయం విదితమే.. ఇక, నేటితో ముగియనున్న ఈ దీపయజ్ఞంలో పెద్ద సంఖ్యల్లో పాల్గొనండి.. ఇల కైలాసంలో చివరి రోజు విశేష కార్యక్రమాల్లో పాలుపంచుకోండి..