హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి టీడీపీ-జనసేన పార్టీలు వచ్చాయి.
చంద్రబాబు- పవన్ మధ్య భేటీ కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయీ సమావేశాల నిర్వహాణపై ప్రస్తావనకు వచ్చే ఛాన్స్.. సీఐడీ పెడుతోన్న వరుస కేసుల పైనా కూడా ఇరువురు చర్చించే అవకాశం.
Hyderabad: హైదరాబాద్ పోలీసులు సంచలనం సృష్టించారు. 10 రాష్ట్రాల్లో కూరగాయల విక్రయదారుడు రూ.21 కోట్ల మోసానికి పాల్పడ్డాడు. ఆయనపై దేశవ్యాప్తంగా 37 కేసులు నమోదయ్యాయి.
ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది అని తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నవంబర్ 30వ తేదీన 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా చోట్ల 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.. నెల రోజులు కొట్లాడి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చుకుందాం.. సూసైడ్ నోట్ పై విచారణ జరిపించాలి.. వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. ముఖ్యమంత్రి, కొడుకు ,కూతురు , అల్లుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
Amit Shah to meet jr NTR again soon in Hyderabad: గత ఏడాది ఆగస్టు నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రముఖ హీరో ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్ షా హైదరాబాద్ రాగా మునుగోడులో బీజేపీ సమరభేరి సభ ముగిసిన తర్వాత అమిత్ షా.. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్ హోటల్లో ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం సాగిన వీరి సమావేశంలో…
పింగళి వెంకయ్య మనవడు గోపి కృష్ణ భార్యపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మల్కాజిగిరి డీఏపీ స్కూల్లో సునీత టీచర్గా పని చేస్తుంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. వెంటనే స్థానికులు స్పందించి దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాది నేరేడ్మెట్ పోలీసులకు అప్పగించారు.
Hyderabad: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. అక్కను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తాతయ్యతో కలిసి సంతోషంగా వెళ్లిన ఓ చిన్నారి జీవితం విషాదంగా ముగిసింది. చిన్నారి పైన నుండి బస్సు వెళ్లడంతో ఓ ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. లక్ష్మారెడ్డి పాలెం లోని క్యాండోర్ షైన్ స్కూల్ బస్సు కుంట్లూరు గ్రామానికి…