హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించింది. ఆక్రమణల కూల్చివేత పనులను హైడ్రా మొదలు పెట్టింది. గాజులరామారం చెరువును ఆక్రమించి నిర్మించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. చింతల చెరువు, దేవేందర్ నగర్, గాజులరామారానికి సంబంధించిన చెరువుల్లో నిర్మించిన 52 అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం అధికారులు, సిబ్బంది మంగళవారం విజయవంతంగా తొలగించారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర ప్రజలకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలు మరింత మెరుగు పర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్.. జీవో Rt.No.345 జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులకు రూ.5560 కోట్లు కేటాయించింది.
మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలోని కాటేదాన్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. త్రుటిలో చిన్నారులకు ప్రాణాపాయం తప్పింది. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీ మణికంఠ హిల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు.
ప్రేమించిన యువతి బంధువులు తన ఇంటిపై రాత్రి దాడి చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహంకాళి నగర్లో చోటుచేసుకుంది.
Cab Driver Dead: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో దాడి ఘటనలో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. అర్ధరాత్రి..కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ..
హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని దుర్గం చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు నంబూరి చాణిక్య వర్మగా గుర్తించారు. నంబూరి చాణిక్య వర్మ (24) మాదాపూర్ లోని చందా నాయక్ తండ వాసిగా గుర్తించారు. కాగా.. చాణక్య వర్మ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్ గా పనిచేసేవాడు.. మొన్న తన రూమ్ నుండి వెళ్లిన చాణక్య వర్మ ఇంటికి…
హైదరాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. బ్రిడ్జి పైన డివైడర్ ని ఢీ కొట్టి కింద పడటంతో యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. ఈ ప్రమాదం ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ అబిడ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కామర్షియల్ కంప్లెక్స్ రెనవేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాజ్ మహాల్ హోటల్ పక్కనే ఉన్న బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. అయితే పక్కనే ఒ వెల్డింగ్ షాపు ఉండటంతో.. వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వల వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.