Constables Suspended: పోలీసులు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.. లంచాలు, వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోని ఉన్నతాధికారులపై నిఘా ఉంచుతామని.. ఆరోపణ నిజమైతే ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించి.. రెండు రోజులకే ముగ్గురు కానిస్టేబుళ్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Read also: Hyderabad Crime: నర్సుపై డాక్టర్ అసభ్య ప్రవర్తన.. కారులో ఎక్కించుకుని..
మధురానగర్ పీఎస్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ చేశారు. నామోదర్, నాగరాజు, సతీష్ లను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు.
హోం గార్డ్ రాజును పోలీసుశాఖకు చెందిన మోటారు ట్రాన్స్ పోర్ట్ కు వెనక్కి పంపి చర్యలు తీసుకున్నారు. స్పా సెంటర్స్ , వ్యభిచార గృహాలనుండి ముగ్గురు కానిస్టేబుళ్లు నెలవారీ మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి రావడంతో సీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. లంచాలతో పాట అక్కడి యువతులతో ఖాకీల రాసలీలు జరిపినట్లు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. స్పా సెంటర్ లోకి ముగ్గురు కానిసేబుళ్లు, హోం గార్డ్ వెళ్లొచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆరోపణలన్నీ వాస్తవమేనని తేలడంతో ముగ్గురు కానిస్టేబుళ్ళపై సస్పెన్షన్ వేటు వేశారు హైదరాబాద్ సీపీ. ఇప్పటికైనా పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని లంచాలు, మామూళ్లు, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులకు సీపీ వార్నింగ్ ఇచ్చారు.
HYDRA Law: త్వరలో హైడ్రా చట్టం.. ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు