వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు శాంతించాయి. పసిడి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. గోల్డ్ లవర్స్ కు ఇది ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. శుభకార్యాలకు, వివాహాది కార్యక్రమాలకు పసిడి కొనాలనుకునే వారు మళ్లీ ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుత్తడి ధరలు ఓ రోజు పెరుగుతూ, ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ, మరో రోజు స్థిరంగా కొనసాగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Also ReadG:Duplicate MRO: ఎంతకు తెగించార్రా.. సెక్రటేరియట్లో బయటపడ్డ నకిలీ తహసీల్దార్
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 7,930, 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)రూ. 8,651 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 79,300 వద్ద అమ్ముడవుతోంది. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 86,510 వద్దకు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 79,450 వద్ద అమ్ముడవుతోంది. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 86,660 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరల్లో కూడా నేడు ఎలాంటి మార్పులేదు. బంగారం ధరలతో పాటు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో నేడు వెండి ధర గ్రాము రూ. 107, కిలో వెండి ధర రూ. 1,07,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 99,500 వద్దకు చేరింది.