ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరల దూకుడుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. సిల్వర్ రేట్ భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర గంటలోనే రూ.21 వేలు క్షీణించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో వెండి ఫ్యూచర్స్ భారీగా పతనమయ్యాయి. ఈరోజు ఇంట్రాడేలో రూ.2,54,174 దగ్గర గరిష్టాన్ని తాకిన వెండి ధర.. రూ.2,33,120 కనిష్ఠానికి పడిపోయింది. స్పాట్ మార్కెట్‌లో కూడా వెండి ధర దిగొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మధ్యాహ్నం 3 గంటల సమయానికి రూ.2.39 లక్షలకు దిగి వచ్చింది.…