హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు. గంట వ్యవధిలోనే వేర్వేరు చోట్ల నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఒక మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకొని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యేలోపే పేట్ బషీరాబాద్ పరిధిలో మరో దొంగ మూడు చైనింగ్ స్నాచింగ్‌లకు పాల్పడగా ఒకటి విఫలమైంది. ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. Read Also: పీజీ వైద్య కాలేజీల్లో ఫీజుల…
నార్కోటిక్ డ్రగ్స్ పై తెలంగాణా నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కూడా డ్రగ్స్ ముఠాలు పై కన్నేసి ఉంచాలని సీపీ ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు డ్రగ్స్ తెచ్చిన మూడు ముఠాలను అరెస్టు చేశారు. మూడు ముఠాల్లో 7 మంది నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన ముఠా నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఇబ్రాన్బాబు షేక్, నూర్ మహ్మద్…
హైదరాబాద్ డ్రగ్స్ కేంద్రo గా మారుతుందా.. హైదరాబాదులో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయి. సంపన్నుల పిల్లలు చాలా వరకు డ్రగ్స్ కు అలవాటు పడ్డారా. కాలేజీలో డ్రగ్స్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయిందా. సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సినిమా స్టార్స్ లో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారా.. వీటన్నిటికీ హైదరాబాద్ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాదులో పెద్ద మొత్తంలో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై మాఫియా హైదరాబాద్ లో తిష్ట వేసి…
కల్తీరాయుళ్లు దేన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల్లో చాలా వరకు కల్తీ చేస్తున్న కేటుగాళ్లను అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేసి పట్టుకుంటున్నా కల్తీ రాయుళ్లు మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రభుత్వం దీనిపై ఎన్ని ఆంక్షలు విధించిన కల్తీ రాయుళ్లు తమ పనిని ఏదేచ్చగా కొనసాగిస్తునే ఉన్నారు. చివరకు ప్రభుత్వం అమ్మే విజయ నెయ్యిని సైతం కల్తీ చేయడానికి ప్రయత్నించారు కల్తీకేటుగాళ్లు. Read Also: ధర్మయుద్ధంలో బీజేపీ గెలిచింది: లక్ష్మణ్ ఈ ఘటన హైదరాబాద్…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇళ్ళలో దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న పాత నేరస్తుడు మంతి శంకర్ తో పాటు మరో ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. మంత్రి శంకర్, సయ్యద్ అసద్, సయ్యద్ మెహరాజ్, మహ్నద్ మొహిజ్ ఖాన్ లను అరెస్ట్ చేశారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సైదాబాద్ పోలీసులు. నిందితులపై మూడు కమిషనరేట్ల పరిధిలో ఆరు కేసులు వున్నాయి. చిలకలగూడకి చెందిన నిందితుడు మంతి శంకర్ పై…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నగరంలో బీజేపీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. Read Also: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ కీలక భేటీ అయితే జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ…
హైదరాబాద్‌లోని శివశక్తి ఫౌండేషన్‌పై సినీ నటి కరాటే కళ్యాణి తీవ్ర ఆరోపణలు చేశారు. శివశక్తి ఫౌండేషన్ ఓ దుష్టశక్తి అని అభివర్ణించారు. అమాయక హిందువుల నుంచి ఈ ఫౌండేషన్ విరాళాలను సేకరిస్తోందని.. వాటిని సొంత అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. శివశక్తి ఫౌండేషన్‌లో పాత సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి నిధులను దారి మళ్లించారన్నారు. శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఏర్పాటుకు రెండున్నర కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేశారన్నారు. Read Also: అయ్య బాబోయ్… ప్రతిరోజూ రూ.కోటిన్నర జరిమానాలు…
పంజాగుట్టలోని టాలీవుడ్ పబ్ పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ పబ్ లో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వారు ఆకస్మిక దాడులు చేసి 9 మంది యువతులు 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు మాట్లాడుతూ” అంతకుముందు కూడా ఈ పబ్ పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, అయితే ఈసారి పబ్ లో అర్ధనగ్న డాన్స్ లు కూడా చేయిస్తున్నారని, సెలబ్రెటీలు…