హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లో పబ్బు యాజమానులతో ఆయన సమావేశం అయి డ్రగ్స్, మత్తు పదార్థాలను నిరోధించడానికి వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఏడేళ్లుగా నగరంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు. ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. హైదరాబాద్ అంటేనే భరోసా అని చెప్పారు. ఒడిశా ఏపీలలో గంజాయి సాగు ఎక్కువగా చేస్తున్నారు. అక్కడి నుండి గంజాయి కొని కొంతమంది హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మంత్రి తెలిపారు. అలాంటి వారిని గుర్తించి అరెస్టు చేసి పీడీ యాక్టు కేసులు పెడుతున్నామన్నారు. వివిధ రకాల మార్గాల్లో వివిధ రకాల పేర్లతో నగరంలో డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నయని ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందన్నారు. ఎక్కడ గాంజా డ్రగ్స్ దందా నడిచిన ఉక్కుపాదం మోపమని సీఎం చెప్పారని మంత్రి వెల్లడించారు. ఎక్కువగా పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఉందని మా దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. పబ్బులో డ్రగ్స్‌తో పట్టుబడితే మీ వెనకాల ఎవ్వరూ ఉన్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగదారుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్న వారిని కూడా వడలవద్దని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. పబ్బుల్లో యజమానులు డ్రగ్స్ వాడకంపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్సైజ్ అండ్ పోలీస్ టీం జాయింట్ టీంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని తెలిపారు.
Read Also: నన్ను పార్టీలో నుంచి బయటకు పంపపాలని కుట్ర చేస్తున్నారు: వీహెచ్
Also Read
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
పబ్బుల్లో డ్రగ్స్ వాడకం వెలుగులోకి వస్తే ఆ పబ్బులను నిరభ్యంతరంగా సీజ్ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. డబ్బులు సంపాదించడానికి అనేజ మార్గాలు ఉంటాయి.. అంతేగాని పబ్బులో డ్రగ్స్ అమ్మి సంపాదిస్తామ్ అంటే కుదరదన్నారు. మూడో కంటికి తెలియకుండా డ్రగ్స్ అమ్మిన మా డిపార్ట్మెంట్ నుండి తప్పించుకోలేరని మంత్రి హెచ్చరించారు. డ్రగ్స్ పై ఫిర్యాదులు చేయడానికి హెచ్చరించడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్‌ను కనిపించేలా పెట్టాలని సూచించారు. కొందరు పబ్బుల్లో అక్రమ దందాలు చేస్తున్నారని మాకు సమాచారం వచ్చిందన్నారు. పబ్స్ వచ్చిన వారు ఎన్ని సిగరేట్‌లు తాగుతున్నారు.
ఒక సిగరేట్‌ను మరో నలుగురు పంచుకుంటున్నారా.. ఇలాంటి వాటిపై దృష్టిసారించాలని మంత్రి తెలిపారు. పబ్బుల్లో విచ్చలవిడిగా సౌండ్స్ పెడుతున్నారు.. సరి చేసుకోవాలని సూచించారు. పక్కన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిమితికి లోబడి సౌండ్స్ సిస్టమ్స్ పెట్టుకోవాలని సూచించారు. పబ్బులపై పర్యవేక్షణ లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిని అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.పబ్బుల్లో డ్రగ్స్ వాడుతున్నట్టు మీకు అనుమానం వస్తే వెంటనే వారి వివరాలు మాకు ఇవ్వాలన్నారు. వెంటనే మా పోలీసులు స్పందించి అదుపులోకి తీసుకుంటారన్నారు. మీ కొడుకులే ఈ డ్రగ్స్‌కు అలవాటు పడితే మీరు ఎంకరేజ్ చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. పబ్బుల్లో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు మీ దృష్టి వస్తే 18004252523 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని మంత్రి పేర్కొన్నారు.
Read Also: కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువు: వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రభుత్వ నిబంధనలు పాటిస్తాం: పబ్స్ నిర్వాహకులు
ప్రభుత్వం సూచించిన నిబంధనలను తప్పకుండా పాటిస్తామని పబ్స్ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకు పబ్బుల్లో డ్రగ్స్ పట్టుబడిన కేసులో లేవని వారు తెలిపారు. డ్రగ్స్ వల్ల మా బిజినెస్ దెబ్బతింటుందన్నారు. పబ్స్ వద్ద ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని, ప్రత్యేక చెక్ పాయింట్స్, సీసీ టీవీ కెమెరాలతో గస్తీ ఉంటుందన్నారు. ప్రభుత్వం కూడా డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పబ్ వద్ద ప్రభుత్వం సూచించిన నిబంధనల పట్టికను ఏర్పాటు చేస్తామన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్లు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకోస్తామని పబ్ నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
ట్రెండింగ్
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!