తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రెన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ. రెండు కోట్ల విలువగల డ్రగ్ స్వాధీనం చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. 4.92 కేజిలతో పాటు, ఓ కార్ సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులు పవన్,మహేష్ రెడ్డి,రామకృష్ణగౌడ్ ను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితులు ఎస్క్ రెడ్డి, హన్మంత్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు…
గంజాయి రవాణా జోరుగా సాగుతూనే ఉంది.. దీంతో.. గంజ విక్రయదారులపై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు.. ‘ఆపరేషన్ గంజా’ పేరుతో నగరంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.. ఇప్పటి వరకు 23 మంది గంజాయి విక్రయదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.. ఒకేసారి 23 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఇక, గంజా ఫ్రీ హైదరాబాద్ గా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా.. ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్న…
హైదరాబాద్ నగరంలో మొన్నటి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బయటకు అడుగు పెడితే చాలు ఎప్పుడు వర్షం కొడుతుందనని అందరూ భయపడుతున్నారు. ఇక శనివారం సాయంత్రం కూడా భాగ్య నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మలక్ పేట, అంబర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కిలో మీటర్ల పొగవున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముఖ్యంగా వర్షం కారణంగా మలక్ పేట…
ట్యాంక్ బండ్ పై నగర ప్రజల ఎంజాయ్ మెంట్ కోసం ట్రాఫిక్ లేకుండా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీంతో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు ఎలాంటి వాహానాలు ప్రయాణించకుండా ఆంక్షలు విధించారు. నగర ప్రజల కోసం ట్యాంక్ బండ్ సరికొత్త రూపుదిద్దుకుంది. అయితే… సాయంత్రపు వేళ అక్కడ విహరించాలంటే.. ట్రాఫిక్ రణవేళ మధ్య కొంత కష్టంగా మారింది. దీంతో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు సాయంత్రపు వేళ ట్యాంక్…
పోలీసు శాఖలో మళ్లీ కరోనా మహమ్మారి కేసులు కలకలం సృష్టిస్తున్నాయి… రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా పలువురు పోలీసు సిబ్బందికి కరోనా సోకుతుంది… హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో పోలీసులు కరోనాబారినపడ్డారు… వరుస ఉత్సవాలు, బందోబస్తులు , నిరసనలు, ఆందోళనలతో పోలీసు శాఖను కరోనా మహమ్మారి వణికిస్తోంది… ఇప్పటికే పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ వేశారు.. అయితే, ఆందోళనలు ముట్టడి కార్యక్రమాలు ఉంటుండడంతో పోలీసులకు కరోనా టెన్షన్ వెంటాడుతోంది… గత నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో…
బిబి పేట మండలం తుజల్ పూర్ గ్రామానికి చెందిన నకిలీ డీఎస్పీ పోలీస్ ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. నిరుద్యోగులను టార్గెట్ చేసుకుని 5 జిల్లాల్లో 20 మంది నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరిట కోటి రూపాయలు వసూలు చేసాడు నెల్లూరు స్వామి. డీఎస్పీ డ్రెస్ లో వాహనాన్ని పెట్టుకొని ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడం, సెటిల్మెంట్ చేసేవాడు. ఇంటర్మీడియేట్ పాస్ కానీ వ్యక్తి డిఎస్పి కావడమేంటని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆశ్రయించారు బాధితులు. హైదరాబాద్ బేగం…
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై హైదరాబాద్ సీసీఎస్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. పలు ప్రైవేటు బ్యాంకుల నుండి రుణాలు తిరిగి చెల్లించలేదంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పు వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకులు ఆరోపణ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రుణాలు తీసుకుని చెల్లించలేదంటూ హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షేర్లను తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో కలిపి రూ.460…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు జస్టిస్ ఎన్వీ రమణ.. రాజ్‌భవన్‌లో ఆయన బస చేస్తున్నారు.. రోజూ పలువురు ప్రముఖులు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిన్న యాదాద్రి వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు ఎన్వీ రమణ దంపతులు.. మరోవైపు, ఇతర ప్రముఖులను కలిసిందేకు ఆయన కొన్ని సార్లు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు.. ఇవాళ ఎస్ఆర్ నగర్ లోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ను నిలిపివేశారు పోలీసులు.. ఇది గుర్తించిన సీజేఐ..…
సినీహీరో నిఖిల్‌కు చెందిన రేంజ్ రోవర్ కారుకు హైదరాబాద్‌లోని కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా కారు కనిపించింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా.. సినీ నటుడు నిఖిల్‌కు చెందిన కారు అని పోలీసులకు తెలిపారు. అయితే, నిబంధనల ఉల్లంఘన సమయంలో నటుడు నిఖిల్ కారులో లేరని పోలీసులు ధ్రువీకరించారు.
హైదరాబాద్ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. ఇప్పటికే 300 కోట్లు రూపాయలను ఫ్రీజ్ చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే బ్యాంకులలో ఫ్రీజ్ అయిన తమ ఖాతాలను తెరిపించుకునే యత్నం చేస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ అధికారుల పేరుతో బ్యాంకులకు ఆదేశాలు, నకిలీ లెటర్ హెడ్, స్టాంపులు వేసి ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన ఢిల్లీ గుర్గావ్ తదితర బ్రాంచులకు పంపించారు. కానీ అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు హైదరాబాద్…