హైదరాబాద్‌లో బైక్, కార్లపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా ఎంతో మంది సతమతమవుతున్నారు. దీంతో ట్రాఫిక్ చలాన్‌లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు త్వరలో తీపికబురు చెప్పనున్నారు. హైదరాబాద్‌లో చాలా రోజులుగా ఎంతో మంది వారి వాహనాలపై ఉన్న చలాన్లను చెల్లించకుండా ఉండడంతో భారీగా చలాన్లు అలాగే ఉండిపోయాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించేందుకు రాయితీ ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అయితే చలాన్లపై ఎంత రాయితీ ఇవ్వలన్నదానిపై పోలీస్ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. గత కొన్నేళ్లుగా చలాన్లు పెండింగ్‌లో ఉండడం, వాహనదారులు చెల్లించలేక చేతులెత్తేయడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ చలాన్లపై ఎంత వరకు రాయితీ ఇస్తారన్న విషయం త్వరలోనే పోలీసులు వెల్లడించనున్నారు.