బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసిన ఢిల్లీవాసి అరెస్ట్ అయ్యాడు. సర్వర్ హ్యాక్ చేసి ఇప్పటివరకు ఐదు కోట్లు కొట్టేసిన కేటుగాడికి అరదండాలు పడ్డాయి. చాలాకాలంగా తప్పించుకొని తిరుగుతున్న హ్యాకర్ ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడినుంచి 53 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. మొదటిసారి కరడుగట్టిన హాకర్ ను దేశంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు…
రోజురోజుకు డ్రగ్స్ వాడకం ఎక్కువవుతోంది. ఒత్తిడి లోనైన యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. అయితే డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వారికి కొత్త కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ కమిషనర్.. సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ వినియోగదారులకి ఉత్సవాల కౌన్సిలింగ్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి బయటికి వచ్చి మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్న నేపథ్యంలో కొత్త నిర్ణయం తీసుకున్నామన్నారు. వినియోగదారులపై నిరంతరం నిఘా పెట్టబోతున్నట్లు సీటీ పోలీస్ బాస్ పేర్కొన్నారు. వారానికి ఒకసారి వినియోగదారుల రక్త,…
ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పులు చేయాల్సి వస్తోంది. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు సరిగా లేకపోవడం వల్ల అప్పులు తీసుకుంటున్నారు. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని సూచించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్. లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారని, పోలీస్ దాడులతో..కొద్దిరోజులు లోన్స్ ఇవ్వటం ఆపేశారన్నారు. అధిక లాభాలు…
తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. పబ్ లలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఖరీదైన డ్రగ్స్ నగరంలో ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నాయి. బంజారా హిల్స్ రాడిసన్ హోటల్ లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ దొరికిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ డ్రగ్స్ పై ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ ని అరికట్టేందుకు పటిష్టమయిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే డ్రగ్ టెస్ట్లు చేయాలని నిర్ణయించింది.…
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో శ్రీరామనవమి వేడుకల్లో శోభకనిపిస్తోంది. వాడవాడలా శ్రీరాముడి కల్యాణం ఘనంగ నిర్వహించారు. శ్రీరామనవమి పేరు చెప్పగానే శోభాయాత్ర గుర్తుకువస్తుంది. సీతారాం బాగ్ నుండి మొదలైంది శోభాయాత్ర. ఆరున్నర కిలో మీటర్లు కొనసాగనుంది శోభాయాత్ర. టాస్క్ ఫోర్స్ , లా అండ్ ఆర్డర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల తరువాత హైదరాబాద్ లో నవమి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారాంబాగ్…
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోందా? డ్రగ్స్ తీసుకున్నవారికి నోటీసులు జారీ కానున్నాయా? అంటే అవునంటున్నారు పోలీసులు. పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. బంజారా హిల్స్ లోని పబ్ లో పట్టుబడిన వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. 20 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా లభ్యమైన ఆధారాలతో దర్యాప్తులో ముందడుగు పడిందంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న…
యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు. ఈ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పబ్ సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రగ్ పెడ్లర్స్ ని పోలీసులు గుర్తించారు. శనివారం రైడ్స్ లో ఓ అనుమానితుడిని గుర్తించిన పోలీసులు. అతడు గోవా కు రెగ్యులర్ గా వెళ్తుంటాడని నిర్దారణకు వచ్చారు. పబ్ కు వచ్చిన వ్యక్తుల్లో ముగ్గురి పై డ్రగ్స్ కేసులు వున్నాయి.…
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదంటోంది కుషిత. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపాలని జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిలిం నటి కుషిత మీడియాను కోరింది. హైదరాబాద్ నగరంలో లేట్ అవర్స్ పబ్ లో ఉండడం మా తప్పు కాదన్నారు జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిలింనటి కుషిత. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అన్న విషయం మాకు తెలియదు. తెలిస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్తాము…? అక్కడ రష్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. డ్రగ్స్ అక్కడ వినియోగిస్తున్నారని మాకు…
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన రాడిసన్ హోటల్ లో పోలీసుల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఫుడింగ్ మింక్ పబ్ కేసుపై అటు పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. పబ్ కేసు లో పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో పబ్ నిర్వాహకులు అనిల్, అభిషేక్ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. ఈ కేసులో పరారీలో…
హైదరాబాద్ రహదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో ఘోర ప్రమాదాల తర్వాత ఇష్టమొచ్చినట్టుగా స్టిక్కర్లు వేసుకుని తిరిగేవారిపై చర్యలు చేపట్టారు. వీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెస్, అడ్వకేట్ల పేరుతో స్టిక్కర్లు అంటించినవారు తప్పనసరిగా సరైన గుర్తింపు కార్డులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు పోలీసులు. లేదంటే సంబంధిత వెహికల్ ని సీజ్ చేస్తామన్నారు. కారులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఈ కారు యజమాని ఆర్సీ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్సులు, బ్లాక్ స్టిక్కరింగ్ నిరోధానికి చర్యలు చేపట్టారు. కారు…