హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది.
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు 2,68,755 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో రైల్వే శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రాకపోకల సౌలభ్యం కల్పించేందుకు రాత్రంతా MMTS రైళ్లను నడపనున్నారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు ఉత్సాహభరితంగా, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డీజేలు, బ్యాండ్లు, కోలాటాలు, డప్పుల మోతలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ భక్తులు భారీగా ట్యాంక్‌బండ్ వైపు తరలివస్తున్నారు.
దుండిగల్‌లో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన తండ్రి-కొడుకులు అదృశ్యమై మృతదేహాలుగా బయటపడ్డారు. వివరాల ప్రకారం, దుండిగల్‌కు చెందిన శ్రీనివాస్ తన కుమారుడితో పాటు వెస్లీ కాలనీ వాసులతో కలిసి ఆటోలో గణేష్ నిమజ్జనానికి వెళ్లారు.