Technology : ఆటోను దొంగను పట్టించిన వాట్సప్ గ్రూప్
- ఆటో మాయం అయ్యిన విషయం తెలుసుకున్న బిపిన్ రాజ్ యాదవ్
- సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆటో గుర్తింపు
- వాట్సప్ గ్రూప్ సభ్యుల సహాయంతో దొంగ పట్టివేత
- రోహిత్‌ను పోలీసులకు అప్పగించి కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆటోను దొంగిలించి పారిపోయిన దొంగను.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టించింది ఓ వాట్సప్ గ్రూప్ !! చోరీ చేసిన కొన్ని గంటల్లోనే దొంగ అడ్డంగా దొరికిపోయాడు !! వాట్సప్ గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఏకమై ఆటోను దక్కేలా చేశారు. ఇంతకూ ఆటో దొంగకు.. వాట్సప్ గ్రూప్‌కి ఉన్న లింక్ ఏంటి..? ఎక్కడో ఆల్వాల్‌లో ఆటో పోతే.. బంజారాహిల్స్‌లో ఎలా పట్టుబడ్డాడు. చోరీలకు పాల్పడిన దొంగలను పోలీసులు తెలివిగా పట్టుకోవడం చూశాం… లేదా సీసీ కెమెరాలు అడ్డంగా బుక్ చేయడం చూశాం… కానీ నగరంలో ఆ ఆటోను దొంగను వాట్సప్ గ్రూప్ పట్టించింది. అది కూడా చోరీ ఐన కొద్ది గంటల్లోనే. ఆల్వాల్ చోరీ ఐన ఆటో… బంజారాహిల్స్ లో దొరికిపోయింది.
Allu Aravind : పవన్ కళ్యాణ్ ను అల్లు అరవింద్ అమ్మ ఏమనిపిలుస్తారో తెలుసా?
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
జార్ఖండ్ కి చెందిన బిపిన్ రాజ్ యాదవ్.. బొల్లారం రిసాలబజార్‌లో నివసిస్తూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగే ఆటోతో రాత్రి ఇంటికి వచ్చిన బిపిన్.. ఇంటి ముందు ఆటోను పార్క్ చేశాడు. తెల్లారి లేచి చూసే సరికి ఆటో మాయం అయ్యింది. చుట్టుపక్కల అంతా గాలించాడు. ఎక్కడా ఆటో కనిపించలేదు. ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఆటోను దుండగులు ఎత్తుకెళ్లడం గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బిపిన్. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలించసాగారు.
సీసీ ఫుటేజ్‌ను కలెక్ట్ చేసుకున్న బిపిన్… తమ జార్ఖండ్ వాసులంతా క్రియేట్ చేసుకున్న జార్ఖండ్ ఏక్ తా సమాజ్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. తన ఆటో పోయిందని… ఆటో నెంబర్, ఆటో ఫొటోలతోపాటు.. సీసీ ఫుటేజ్‌ను కూడా గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. గ్రూప్‌లో ఉన్న దీపక్ కుమార్.. తాను ఉన్న మరికొన్ని వాట్సప్ గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేశాడు. విషయం తెలుసుకున్న వాళ్లంతా.. నిఘా పెట్టారు. ఇదే క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లోని స్టార్ హాస్పిటల్ వద్ద డ్రాపింగ్ కి వచ్చిన ఆటో డ్రైవర్.. బిపిన్ ఆటోను గుర్తించాడు. గ్రూప్‌లో ఉన్న ఫొటోలతో మ్యాచ్ చేసి చూశాడు. ఇది బిపిన్ ఆటో అని నిర్ధారించుకుని.. దీపక్ కుమార్ కి కాల్ చేసి చెప్పాడు. ఆటో రోడ్ నెంబర్ 10 లో ఉందని గ్రూప్‌లో పోస్ట్ చేశాడు కల్లుకుమార్. విషయాన్ని బిపిన్ కి చెప్పాడు దీపక్ కుమార్.
బిపిన్ ఆటోకు ఉన్న స్టిక్కర్లనె ఓ వ్యక్తి తొలగిస్తుండటాన్ని గమనించాడు కల్లుకుమార్. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి ఈ ఆటో ఎవరిదని ప్రశ్నించాడు. ఆటో తనదే అని.. స్టిక్కర్ పాతదైపోయింది.. అందుకే తొలగిస్తున్నాను అంటూ బుకాయంచసాగాడు. అక్కడికి చేరుకున్న మరికొందరి సహాయంతో ఆటో స్టిక్కర్లు తొలగిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఆటోను దొంగిలించింది అతడే అని సీసీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించుకున్నారు. ఆటోను చోరీ చేసింది జీడిమెట్లకు చెందిన రోహిత్ గా గుర్తించి… బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు ఆటో డ్రైవర్లు.
రోహిత్‌ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. ఆల్వాల్ పోలీసులకు అప్పగించారు. రోహిత్‌పై చోరీ కేసు నమోదు చేశారు. ఆటోను గుర్తించి సమాచారం ఇచ్చిన కల్లుకుమార్‌ను పోలీసులు అభినందించారు. ఫార్వర్డ్ మెసేజ్‌లే కదా అని లైట్ తీసుకోకుండా… విషయాన్ని చదవడం వల్లే ఆటోను గుర్తించగలిగాను అని చెప్పాడు కల్లుకుమార్. స్టిక్కర్లు తొలగించి.. నెంబర్ ప్లేట్‌ను మార్చి ఉంటే.. ఆటో దొంగను పట్టుకోవడం కష్టతరమయ్యేది.
Kajal Aggarwal: యాక్సిడెంట్ వార్తలపై స్పందించిన కాజల్.. ఎక్స్ వేదికగా పోస్ట్
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..