Road Accident: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వెళుతున్న ఒక కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టుకుంటూ అవతలి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ఆ కారుతో పాటు మరో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. విమానాశ్రయం వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళుతున్న ఒక కారు చెన్నమ్మ హోటల్ సమీపంలో అకస్మాత్తుగా అదుపు తప్పింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో డ్రైవర్ సడెన్‌గా…
హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని వాల్యూ జోన్ హైపర్‌మార్ట్ షాపింగ్ ప్రేమికులకు పండుగ వాతావరణాన్ని అందిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఈ ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్లో దసరా, దీపావళి పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని విస్తృత ఆఫర్లు, ప్రత్యేక రాయితీలు సిద్ధం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ధాటిగా విరుచుకుపడ్డారు. "ప్రజాపాలనలో ప్రజలు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు మేలు చేసేలా లేదు, ముడుపుల పాలనగా మారింది" అంటూ ఆరోపించారు.
డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా మత్తుమందును తయారు చేసి విక్రయిస్తున్న మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్‌ను ఈగల్ టీం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది.
హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది.
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం ఇప్పటివరకు 2,68,755 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి.
వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో రైల్వే శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రాకపోకల సౌలభ్యం కల్పించేందుకు రాత్రంతా MMTS రైళ్లను నడపనున్నారు.