హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన సంఘటన చోటు చేసుకుంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీగణేష్ కాన్వాయ్‌పై సుమారు 30 మంది యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన ఓయూ పోలీస్ స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో జరిగింది. సమాచారం ప్రకారం, మాణికేశ్వర్ నగర్లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ను యువకులు అడ్డగించారు. వారు కాన్వాయ్‌లో ఉన్న గన్మెన్ల వెపన్స్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొనగా, ఎమ్మెల్యే శ్రీగణేష్ కారులోనుంచి…
తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు.. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు శైలజనాథ్, ఇతర వైసీపీ నాయకులు హజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు అని మండిపడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుంటామంటే ఊరుకోము.. తాడిపత్రిలో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో ప్రభుత్వానికి జీవో జారీ…
Muralidhar Rao : నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సోదాలు సుమారు 15 గంటల పాటు కొనసాగాయి. మురళీధర్ రావు నివాసమైన బంజారాహిల్స్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో వెలుగు చూసిన కోట్లాది రూపాయల అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దర్యాప్తులో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన భారీ స్థిరాస్తులు,…
హిమాచల్‌ను ముంచెత్తిన వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం హిమాచల్‌ప్రదేశ్‌ను ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. దీంతో మండి జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండచరియలు విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలే దెబ్బతిన్నాయి. ఆకస్మాత్తుగా వరదలు సంభవించడంతో చాలా మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇక పంగ్లుయెడ్ గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది గల్లంతయ్యారు. వారికి సంబంధించిన నలుగురి మృతదేహాలు దాదాపు 150 కి.మీ. దూరంలో…
తమ స్వలాభం కోసం బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ యువత బంగారు భవిష్యత్ ను చిద్రం చేస్తున్న వీళ్లా సెలబ్రిటీలు!? అంటూ సినీ సెలబ్రిటీలు ఇతర సెలబ్రిటీలపై వీసీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. సమాజ శ్రేయస్సుకు నాలుగు మంచి పనులు చేసి యువతకు ఆదర్శంగా ఉండాల్సిన మీరు.. బెట్టింగ్ యాప్ లకు బానిసలను చేసి ఎంతో మంది యువకుల మరణాలకు కారణం అయ్యారు. మీరు బెట్టింగ్ కు ప్రోత్సహించడం వల్లే యువత బంధాలు, బంధుత్వాలను మరిచి…
విజయ్ దేవరకొండ కేసు లో కమిషనర్ విచారణకు రాకపోతే డీజీపీని రప్పించాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది జాతీయ ఎస్టీ కమిషన్. తాజాగా సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. అసలు విషయం ఏమిటంటే ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. Also Read : Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్‌పై జక్కన్న గ్రాండ్ అప్డేట్.. ఇదే…
హైదరాబాద్‌లో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా కల్తీ కల్లు సేవించి వాంతులు, విరోచనాలతో కూకట్పల్లి రాందేవ్ రావు ఆసుపత్రికి వచ్చే లోపే మౌనిక(25) అనే యువతి మృతి చెందింది. కానీ ముగ్గురు మాత్రమే మరణించినట్లు అధికారికంగా వెల్లడించారు. సీతారం, స్వరూప, మౌనిక మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. నారాయణమ్మ, బొజ్జయ్య అనే ఇద్దరు కూడా కల్తీ కల్లు తాగడం వల్లే చనిపోయినట్లు తెలుస్తోంది.
కల్తీ కల్లు కేసు వ్యవహారంలో కల్లు కాంపౌండ్ ఓనర్ నిర్వాకం బయటపడింది. కల్తీ కల్లు తాగి స్వరూప అనే మహిళ అస్వస్థకు గురైంది. నాలుగు రోజుల క్రితమే నిజాంపేటలోని హోలీ స్టిక్ హాస్పిటల్లో చేరింది. నిన్న చికిత్స పొందుతూ ఆమె మరణించారు..
భర్తలను భార్యలు మట్టుబెడుతున్న అనేక ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ప్రరిడిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై మోది భర్తను హత్య చేసింది భార్య. భర్త మద్యానికి బానిసై తరచూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించింది.
పెళ్లై రెండు నెలలు కూడా కాలేదు...!! భర్త వేధిస్తున్నాడని భార్య హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ! లక్కీగా స్థానికులు కాపాడారు. ప్రాణాలతో బయటపడింది. హమ్మయ్య అనుకునేలోపు.. భార్య కేసు పెట్టిందని భర్త హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హ్యాపీగా సంసారం చేసుకోవాల్సిన జంట.. సాగర్ లో ఎందుకు దూకింది. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిందెవరు..?