వినాయక నిమజ్జన వేడుకల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో రైల్వే శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. భక్తులకు రాకపోకల సౌలభ్యం కల్పించేందుకు రాత్రంతా MMTS రైళ్లను నడపనున్నారు. ఈ సదుపాయం శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగనుంది. రేపు ఉదయం 4.40 గంటల వరకు MMTS రైళ్లు నిరంతరంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
రైల్వే శాఖ సమాచారం ప్రకారం మొత్తం 8 ప్రత్యేక MMTS రైళ్లు వివిధ మార్గాల్లో నడపబడనున్నాయి.
ఈ రైళ్లు భక్తులకు రాత్రి వేళల్లో సులభంగా గణేశ్ నిమజ్జన ప్రాంతాలకు చేరుకునేలా ఉపయోగపడనున్నాయి.
భక్తులకు రైల్వే సౌకర్యం
ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలో రద్దీ తీవ్రంగా పెరుగుతుందనే దృష్ట్యా, రాత్రి బస్సులు, ప్రత్యేక వాహనాల తోపాటు ఈసారి MMTS రైళ్లను రాత్రంతా నడపడం విశేషం. పోలీసులు, GHMCతో కలిసి రైల్వే శాఖ ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. భక్తులు, ప్రయాణికులు రాత్రివేళల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోవడానికి MMTS సర్వీసులను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. రద్దీ ప్రాంతాలకు వెళ్లే ముందు వీలైనంత వరకు ప్రజా రవాణా సౌకర్యాలను మాత్రమే ఉపయోగించుకోవాలని కోరింది.