ACB Raids : కరీంనగర్‌కు చెందిన నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) శ్రీధర్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) బుధవారం తెల్లవారుజామున భారీగా దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీధర్‌పై నమోదైన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు, పెద్దఎత్తున అక్రమ ఆస్తులు వెలుగులోకి తీసుకొచ్చారు. కరీంనగర్, సిద్ధిపేట్, వరంగల్, హైదరాబాద్ సహా మొత్తం 13 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని…
Cyber Fraud : సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు వినిపిస్తూ నకిలీ కోర్టు డ్రామాతో ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను మోసం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఓ వీడియో కాల్ వచ్చింది.…
Prabhakar Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం రాత్రి చేరుకున్నారు. 15 నెలల విరామం తర్వాత ఆయన స్వదేశానికి పయనించారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఆయన విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ అధికారుల ఎదుర్కొన్నారు. లుకౌట్ నోటీసులు అమలులో ఉండటంతో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్ స్కానింగ్ సమయంలో అధికారులకు…
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీకార్యాలయం మళ్లీ మారింది. గత రెండు నెలలుగా వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి పని చేస్తున్న సిట్‌ను మాసబ్ ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోకి బదిలీ చేశారు. ఈ కార్యాలయ మార్పుతో కేసు విచారణపై ఉత్కంఠ తీవ్రంగా పెరిగింది. రేపు కీలక సూత్రధారి, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ కార్యాలయం వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ రాత్రికి ప్రభాకర్ రావు…
Fish Prasadam : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన ప్రముఖ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటుల చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన వృద్ధడు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు చేప ప్రసాదం పొందేందుకు ఏర్పాటు చేసిన క్యూ లైన్లో నిలబడి ఉన్న సమయంలో హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. Janasena: మట్టి తవ్వకాలలో రెండు వర్గాలుగా విడిపోయి వీధికెక్కిన జనసేన నేతలు.. ఆపై దాడులు..! సమాచారం…
Harish Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే.. ఈ రోజు కూడా మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు మరోసారి ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. Murder Mystery : బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ హత్య కేసు చేధించిన పోలీసులు.. అయితే.. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని…
MLC Kavitha : హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ప్రాంగణం మంగళవారం ఉదయం ఉద్రిక్త వాతావరణాన్ని చూసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ఈ ధర్నాకు భారీ సంఖ్యలో జాగృతి కార్యకర్తలు తరలివచ్చారు. కవిత తన వ్యాఖ్యలతో ఈ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు.…
Telangana Jagruthi : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. జూన్ 4న బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ…
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదకొండేళ్ళు పూర్తయి పన్నెండో సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.
హైదరాబాద్ బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసవానికి వచ్చిన గర్భిణి, అప్పుడే పుట్టిన బాబు మృతి చెందారు. స్టాఫ్ నర్స్ గర్భిణీ స్ర్తీకి డెలివరి చేసింది. ఆయమ్మ సహాయంతో.. ఇద్దరూ కలిసి డెలివరి చేయడంతో తల్లి, బిడ్డ పరిస్థితి విషమంగా మరి మృత్యువాత పడ్డారు..