Food Safety Raids : గోల్కొండ ఫోర్ట్ సమీపంలోని బడా బజార్ ప్రాంతంలో నిబంధనలకీ నాణ్యతకీ వ్యతిరేకంగా నడుస్తున్న సమోసా తయారీ కేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ టీమ్ అక్కడికి వెళ్లి తనిఖీలు చేసింది. కమిషనర్ ఆదేశాలతో జరిగిన ఈ తనిఖీల్లో అనేక అధ్వాన్న పరిస్థితులు బయటపడ్డాయి. ఆ సెంటర్‌కు సరైన లైసెన్స్ లేకపోవడమే కాక, చాలా అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు అక్కడ తయారీని నిలిపివేశారు.
NEET Score Scam: ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం.. రూ. 90 లక్షలు డిమాండ్!
సమోసా తయారీలో వాడుతున్న పదార్థాల్లోనూ నాణ్యతలోపాలు కనిపించాయి. వాడిన నూనె మళ్లీ మళ్లీ వేయించడం, ఎలుకల మలంతో కలుషితమైన వంటగదులు, ఎలాంటి హైజిన్ లేకుండా తయారీ జరగడం వంటి అంశాలపై అధికారులు తీవ్రమైన అభ్యంతరం తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిని ఉపేక్షించబోమని, ఎవరికైనా ఇలాంటి అనుమానాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు..
NEET Score Scam: ముంబైలో వెలుగు చూసిన నీట్ స్కోర్ బాగోతం.. రూ. 90 లక్షలు డిమాండ్!