GHMC : హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్ హాసన్ 63 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు (25 ఓట్లు)పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22…
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.. ఉదయం 8 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది.. ఇప్పటికే కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.. మరో రెండు, మూడు గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.. మొన్న జరిగిన ఎన్నికల్లో 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు..
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు.
బాధలో ఉన్నా.. సంతోషంలో ఉన్న సెలబ్రేట్ చేసుకోవాలంటే మద్యం ఉండాల్సిందే అన్నట్లు మారిపోయాయి పరిస్థితులు. మరికొందరికైతే చుక్కపడనిదే పూటగడవని పరిస్థితి. షాప్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇలాంటి మద్యం ప్రియులకు బిగ్ షాక్. ఏకంగా 4 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే? ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. Also…
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయారని, రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీభవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు పోటీ చేస్తోంది? సరిపడా బలం లేదు, ఓడిపోతామని ముందే తెలుసు… అయినా వెరవకుండా కాలు దువ్వడానికి కారణం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కాషాయ దళం దగ్గర స్పెషల్ స్కెచ్ ఉందా? ఓ పథకం ప్రకారం మజ్లిస్‌తో తలపడాలనుకుంటోందా? ఏంటా పథకం? ఎలా వర్కౌట్ అవుతుందని భావిస్తోంది కమలం? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎంఐఎం, బీజేపీ బరిలో ఉన్నాయి. ఈ…