గణేశ్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా మెట్రో రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. లాస్ట్ ట్రైన్ మధ్యరాత్రి 1 గంట వరకు నడపనున్నట్లు వెల్లడించింది. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై 7 వ తేదీ మధ్యరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు కొనసాగనున్నాయి. గణపయ్య భక్తులకు ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Hyderabad Metro: గణేష్ నిమజ్జనం కోసం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. పదకొండో రోజైన గురువారం జరిగే నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హుస్సేన్‌సాగర్ చుట్టుపక్కల 5 చోట్ల 36 క్రేన్లు, పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన కేంద్రాలను సిద్ధం చేశారు.
హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. శుక్రవారం హైదరాబాద్‌లో గణేష్ మహా నిమజ్జనం ఉన్న నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.. ఈ మేరకు మెట్రో ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు. గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా.. మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నాం.. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు…