September 17: సెప్టెంబర్ 17 అంటే ఒక ఉద్యమం.. ఒక ఉద్వేగం.. చరిత్రలో నిలిచిపోయిన సందర్భం.. పాత తరాల పోరాటానికి, భావి తరాలు స్ఫూర్తి పొందడానికి వాస్తవంగా నిలిచిన నిజమైన ఉదాహరణ. తెలంగాణ చరిత్రలో మర్చిపోలేని రోజు.. సెప్టెంబర్ 17. ఆ రోజు తెలంగాణ సమాజం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యానికి మళ్లిన రోజు. నిరంకుశ నిజాం ప్రభువుకు, ప్రజలకు మధ్య జరిగిన పోరు. కానీ దాన్ని హిందూ ముస్లిం మతాల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం…
Hyderabad Liberation Day: ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీని ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’గా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదారాబాద్ సంస్థానానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగి ఇండియన్ యూనియన్‌లో చేరిందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్ 17, 1948న 'ఆపరేషన్ పోలో' అనే పోలీసు చర్య తర్వాత ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది.
PM Modi : హైదరాబాద్‌కు కేంద్రం మంగళవారం భారీ ప్రకటన చేసింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా జరుపుకుంటామని చెప్పారు.
Amit Shah: సర్దార్ పటేల్ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించకపోయేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశమే సర్వస్వమే నినాదంతో.. ఆపరేషన్ పోలోను ప్రారంభించారన్నారు.
సెప్టెంబర్ 17పై తెలంగాణలో ఇప్పుడు రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి… కొందరు చరిత్రను అనుగుణంగా మాట్లాడితే.. మరొకరు చరిత్రను వక్రీకరిస్తూ తమకు అనుకూలంగా మార్చుకునేవాళ్లు ఉన్నారు.. తెలంగాణ సాయుధ పోరాటంతో అసలు సంబంధం లేనివాళ్లు కూడా.. దానిని ఐజాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇంతకీ సెప్టెంబర్ 17న అసలేం జరిగింది.. నిజాం రాజుతో పాటు ఆయన సంస్థానంలోని భూస్వాములకు వ్యతిరేకంగా హిందూ, ముస్లింలు ఏకమై పోరాటాలు చేసిన ఆ పోరాటం జరిగింది.. భూమి కోసం.. భుక్తి కోసం..…
సెప్టెంబర్ 17పై తెలంగాణలో రాజకీయం రంజుగా జరుగుతోంది. పార్టీలన్నీ వేడుకలను తలో పేరుతో నిర్వహిస్తున్నాయి… విలీనం అని ఒకరు.. విమోచనమని మరొకరు.. విద్రోహమని ఇంకొకరు.. ఇలా పలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.. పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు జరిపారు. తమ తమ నియోజకవర్గాల్లో మంత్రులు కూడా ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ…