భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తిగా కారుమబ్బులతో పూర్తిగా చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుస్తున్నాయి. నేడు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం…
జూలై 24న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని అనుకున్న విషయం తెలిసిందే.. అయితే.. భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. దీంతో మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని.. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు ‘గిఫ్ట్ ఏ స్మైల్ (Gift A Smile)’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా…
పోలీస్ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాతపరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయనున్నారు. వచ్చే నెల ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాతపరీక్ష జరగనుండటంతో ఆయా పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే.. అభ్యర్థులు వాటిలో తమ వేలిముద్రలను నమోదుచేయాల్సి ఉంటుంది. కాగా.. 554 ఎస్సై పోస్టుల కోసం జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 పరీక్ష కేంద్రాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 35 పట్టణాల్లో…