గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం చేరింది. హిమాయత్ సాగర్ 2 ఫీట్ల మేరా 4 గేట్లు, గండిపేట 4 ఫీట్ల మేరా 6 గేట్లు ఎత్తి జల మండలి అధికారులు నీటిని విడుదల చేసారు. దీంతో.. వికారాబాద్, శంకర్‌పల్లి, మోకిలా, పరిగి, షాబాద్, షాద్‌నగర్ నుండి జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. రాజేంద్రనగర్ నుండి హిమాయత్ సాగర్ వెళ్లే సర్వీసు రోడ్డును ట్రాఫిక్ పోలీసులు మూసి వేసారు. వర్షాలకు ఈసీ, మూసీ వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు పోలీసులు. మరో రెండు రోజులు ఏగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత వాసులకు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
read also: Interesting News: ఆసక్తికరమైన వార్త. ఏక్‌నాథ్ షిండేను చూస్తుంటే ఎవరో గుర్తొస్తున్నారు. ఆయనే..
అయితే నిన్న మంగళవారం భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తీగా మబ్బులతో చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుసాయి. నేడు, రేపు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. భారీగా వర్షం పడే అవకాశం వుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. ఇది ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలో కోమరీన్ ప్రాంతం వరకూ విస్తరించింది. ఇక మరోవైపు తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడి, రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
Amit Shah: మోదీ నాయకత్వంలో కొత్త భారత్ రూపుదిద్దుకోనుంది