Raghunandan Rao: ఏ చట్ట ప్రకారం మంత్రి గాల్లో కాల్పులు జరిపారు.. సస్పెండ్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్‌నగర్ ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గాల్లోకి కాల్పులు జరపటం కలకలంరేపుతుంది. దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న మహబూబ్‌నగర్‌లో ఏ చట్ట ప్రకారం తుపాకి తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపారని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఏమైనా లైసెన్స్ ఉందా అని రఘునందన్‌రావు అడిగారు. దీనిపై మాట్లాడేందుకు డీజీపీ ఆఫీసుకు ఎప్పుడు రమ్మంటారు, మంత్రి పేల్చిన తుపాకిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని అన్నారు. లేకుంటే.. రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని, ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రఘునందన్‌రావు కోరారు.
అయితే.. భారతీయ శిక్షా స్మృతి, రాజ్యాగం ప్రకారం ఈ చట్టాలలో ఎక్కడ అన్న ఎస్పీకి ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమని చెప్పే చట్టముందా అంటూ ప్రశ్నించారు. తను ఒక బాధ్యత గల మంత్రి, తన గన్‌మెన్ దగ్గర నుంచి తీసుకున్నారు. కానీ.. దాని కప్పి పుచ్చుకోవాడానికి ఎస్పీ నేనే ఆ తుపాకీ ఇచ్చాను అని చెప్పారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఎస్పీపై చర్యలు తీసుకోవాలని, శ్రీనివాస్ గౌడ్‌ను వెంటనే మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. డీజీపీ మహేందర్ రెడ్డి రిటైర్డ్ అయ్యాక వచ్చే సలహాదారు పోస్టు కోసమే ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
అసలేం జరిగింది?
ఫ్రీడం ఫర్ ర్యాలీ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో.. మహబూబ్‌నగర్ ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అయితే..ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ర్యాలీ ప్రారంభ సమయంలో తుపాకీ తీసుకుని గాల్లోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. దీంతో పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి కాల్పులు జరపటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై మంత్రే స్వయంగా వివరణ ఇచ్చారు. తను ఫ్రీడం రన్ ప్రారంభోత్సవం వేళ రబ్బర్ బుల్లెట్ తుపాకీని పేల్చినట్లు స్పష్టం చేశారు. మంత్రికి తుపాకీ ఎస్పీనే స్వయంగా ఇచ్చారని వివరించారు. అయితే.. గతంలోనూ క్రీడల ప్రారంభోత్సవ సమయంలో రబ్బర్ బుల్లెట్ పేల్చినట్లు చెప్పారు. కావాలనే కొందరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
Gorantla Madhav: టీడీపీ నేతలకు సవాల్.. చంద్రబాబు వీడియోను అమెరికా ల్యాబ్‌లో టెస్ట్ చేయించాలి
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!