తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎపిసోడ్‌తో పాటు.. మునుగోడు ఉప ఎన్నికలు.. చండూర్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ పెద్ద రచ్చగా మారిపోయింది. క్షమాపణ చెప్పాలన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌తో దిగివచ్చిన తెలంగాణ పీసీసీ చీఫ్.. క్షమాపణలు కోరుతూ వీడియో విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు మంచిది కాదన్న ఆయన. ఈ ఘటనపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్షమాపణలు కోరారు.. నేను ఎలాంటి కండిషన్ లేకుండా క్షమాపణలు చెబుతున్నట్టు వీడియోలో పేర్కొన్నారు.
read also: Chinta Mohan: ఏపీలో అధికారంలోకి వస్తాం.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..
రేవంత్ రెడ్డి క్షమాపణ- వెంకట్ రెడ్డి రియాక్షన్ః
అయితే దీనిపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన విషయం నా దృష్టికి రాలేదు, నేను చూడలేదు వినలేదని సంచళన వ్యాఖ్యలు చేశారు. నాపైన వాడరాని పదం వాడిన వారిని సస్పెండ్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. పాదయాత్రలో పాల్గొనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఉద్యమకారున్ని అనరాని మాటలు అన్నారని మండిపడ్డారు. తనను అనరాని మాటలు అన్న వారిని పూర్తీగా బహిష్కరించిన తర్వాతే ప్రచారంలో పాల్గొనే విషయం పాదయాత్రలో పాల్గొని విషయం పై ఆలోచిస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచళన వ్యాఖ్యలు ఇప్పడు దుమారం రేపుతున్నాయి.
రేవంత్ క్షమాపణల- విహెచ్ స్పందన
రేవంత్ క్షమాపణల పై సీనియర్ నేత విహెచ్ స్పందించారు. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలోచనలు చేయాలని సూచించారు. పార్టీ నుండి ఎవరు బయటకు వెళ్లకుండా ఒక సీనియర్ నాయకుడిగా తనుకూడా ఆపే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకి అన్యాయం జరగకూడదని పేర్కొన్నారు. నేను కోమటిరెడ్డి తో మాట్లాడతా అని తెలిపారు. పీఎసీ సమావేశంలో పార్టీ అంతర్గత విషయాలు చర్చిస్తానని వీహెచ్ ఈ సందర్భంగా తెలిపారు.
జరిగింది ఇదిః
చండూర్ లో జరిగిన కాంగ్రెస్ సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ లో భగ్గుమంటున్నాయి. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అద్దంకి దయాకర్ ను సస్పెండ్ చేయాల్సిందే నని డిమాండ్ పై ఆగస్టు 6వ తేదీని అద్దంకి దయాకర్ క్షమాపనలు చెప్పిన కోమటి రెడ్డి వెంకట్ స్పందించలేదు. క్షమాపణలు కాదు సస్పెండ్ చేయాల్సిందే అంటూ డిమాండ్ కు దిగడంతో.. ఇవాళ మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి క్షమాపణ చెప్తున్నా, భవిష్యత్తులో అలా జరగనివ్వనని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తెలిపారు. పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతో.. మరోసారి క్షమాపణలు చెబుతూ ఓవీడియో ద్వారా ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.
తాజా పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టే కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ వీడినందుకు తనను టార్గెట్ చేసి అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. ఆ పార్టీ కోసం పనిచేస్తున్న తనను రేవంత్ రెడ్డి హోంగార్డుతో పోల్చడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నిక విషయంలో తనను పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకట్‌రెడ్డి.. చండూరు సభలో ఓ పిల్లగానితో తనను తిట్టించారని, అక్కడే అతడిని లాగిపెట్టి కొట్టాల్సిందన్నారు.. తన లాంటి సీనియర్‌ను తిట్టిన అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, తిట్టించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Bhadradri Kothagudem: వజ్రోత్సవాల్లో ప్రజాప్రతినిధుల “నాటు నాటు” డ్యాన్స్