Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లాల్‌దర్వాజ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ భవనం నిమిషాల్లోనే మంటలకు ఆహుతైంది. రెండు అంతస్తుల ఈ షోరూంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఒక్కొక్కటిగా పేలిపోవడం వల్ల బాంబులు పడుతున్నట్టు భారీ శబ్దాలు వినిపించాయి. భవనం ముందు పార్క్ చేసి ఉన్న సీఎన్‌జీ కారు కూడా మంటల్లో చిక్కుకుని…
Fire Break : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ కవర్లు తయారీకి ఉపయోగించే ఓ పాలిమర్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. పొగలు కమ్మేయడంతో పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్‌లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. ప్రాణనష్టం సంభవించిందా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.…
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్లైవుడ్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురాలో గురువారం ఉదయం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్టూన్ గోదాంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి శ్రమించారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గోదాంలో…
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద బాధితుల పట్ల విద్యుత్ శాఖ అధికారి అమానవీయ ప్రవర్తనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అభ్యర్థిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లేఖలో ఇలా రాసుకొచ్చారు. చార్మినార్‌లోని గుల్జార్ హౌస్‌లో జరిగిన వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మన నగరాన్ని కలచివేసింది.
అగ్ని ప్రమాదం సమాచారం అందగానే హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మంటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒకేసారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలను హైడ్రాకు చెందిన 5 డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి మంటలు వ్యాప్తి చెందకుండా ఆపాయి.
Gulzar House Fire Incident: హైదరాబాద్ లోని గుల్జార్ హౌస్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ భవనంలో సంభవించిన ఈ ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు అనేక దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వం ఇప్పటికే హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే క్లూస్, ఫోరెన్సిక్…
Gulzar House : హైదరాబాద్ గుల్జార్‌హౌస్ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకున్న భయంకర అగ్నిప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల ప్రాణాలను బలితీసుకుంది. ముత్యాల వ్యాపారిగా పేరుగాంచిన ప్రహ్లాద్ మోడీ కుటుంబం ఈ విషాద ఘటనలో మృత్యుపాశంలో చిక్కుకుంది. వారి కుటుంబాన్ని చుట్టుముట్టిన మంటలు, ఆనాటి నుండి నేటి వరకు సాగిన వారసత్వాన్ని ఒక్కసారిగా భస్మంగా మార్చేశాయి. Honda Rebel 500: కుర్రళ్లను అట్రాక్ట్ చేస్తోన్న బైక్.. హోండా కొత్త ప్రీమియం బైక్ రెబెల్ 500…
హైదరాబాద్‌లోని మైలార్ దేవ్ పల్లెలో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో 53 మంది చిక్కుకున్నారు. భవనం నుంచి బయటికి వెళ్లేందుకు ఉన్న మెట్ల దగ్గరే భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని వాళ్లంతా..
హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటన వివరాలు తెలిసి అత్యంత షాక్‌కు, బాధకు గురయ్యానన్నారు. ఈ విషాద ఘటన హృదయవిదారకంగా ఉందని.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు.