GHMC : రాబోయే గణేష్ ఉత్సవాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు లేకుండా, శాంతియుత వాతావరణంలో జరగాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సహకారం అవసరమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో, ఈ నెల 27న ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించనున్న గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్ అధ్యక్షతన…
Aashadam Bonalu 2025 : ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు నేడు (గురువారం) నుండి ఘనంగా ప్రారంభంకానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనం తో ఈ ఉత్సవాలకు తెరలేచింది. ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ చౌరస్తాలో నిర్వహించే కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొని బోనాలకు అధికారికంగా ప్రారంభం పలుకనున్నారు. Virgin Boys:…
త్వరలో బోనాల పండుగ రానుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గుడి కమిటీ సభ్యులకు కీలక సూచనలు చేశారు. బోనాలు ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్క గుడి కమిటీ మెంబర్స్ గుడి బయట ఒక బ్యానర్ పెట్టాలని కోరారు. "మద్యం తాగి మా గుడి లోపట రావద్దు" అని అందులో రాయాలన్నారు.
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మీయ పండుగలలో ఒకటైన బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది తొలి బోనం జూన్ 26న చారిత్రాత్మక గోల్కొండ కోటలో ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తర్వాత వరుసగా బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయి. బోనాల పండుగను రాష్ట్ర గౌరవానికి మారు పేరుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 20 కోట్లు…
Khairatabad Ganesh : హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపనగా కర్ర పూజ ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమాన్ని శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి,…
తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పాతబస్తీ లాల్ దర్వాజ మహాంకాళి బోనాల జాతర ఉత్సవాలు జులై 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంవత్సరం 117వ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
35 ఏళ్ల తర్వాత హోలీ పండుగ, రంజాన్ మాసములోని రెండవ శుక్రవారం ఒకే రోజు వచ్చాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రెండు పండుగలు సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ , సిటీ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ప్రతి జోన్ లోని సున్నితమైన, ముఖ్యమైన ప్రాంతాలలో పికెట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని…