ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడటంతో మహిళ మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. మూసాపేట్ వై జంక్షన్ వద్ద చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మహిళ(45)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. తీవ్రరక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో ఘరానా మోసం జరిగింది. మంత్రాలతో చేతబడిని తొలగిస్తాను, దెయ్యాన్ని తొలగిస్తాను అంటూ నమ్మించి గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళకు టోకరా వేసిన ఘటన ఫిల్మ్నగర్లో చోటుచేసుకుంది.
A young man stripped a woman on the road in Balajinagar: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెను నడి రోడ్డుపైనే వివస్త్రను చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని బాలాజీనగర్లో చోటుచేసుకుంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారు అడ్డుకోవాల్సింది పోయి.. వీడియోలు తీస్తూ చోద్యం చూశారు. 15 నిముషాల పాటు యువతి నగ్నంగా రోడ్డుపైనే ఏడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.…
హైదరాబాద్ నాచారంలో సనా అనే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఓ కంపెనీ విధులు నిర్వహిస్తుంది. కొద్ది రోజుల క్రితం తనకు నాచారంకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్త వేరొక మహిళతో వివాహేత సంబంది కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆమె సహించలేకపోయింది.
hyderabad Crime: హైదరాబాద్లోని మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.. తీగలగూడలో మొండెం లేని గుర్తు తెలియని మహిళ తల లభ్యం అయ్యింది.. ఓ నల్ల కవర్లో మహిళ తల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో విసిరేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు.. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలను స్వాధీనం చేసుకున్నారు.. హత్య చేసి తలను తెచ్చి పడవేశారని భావిస్తున్నారు.. హత్యకు గురైన మహిళ ముస్లిం మహిళగా అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే,…
LB nagar flyover: ఎల్బి నగర్ ఫ్లైఓవర్ నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న 37 ఏళ్ల వ్యక్తిని చాకచక్యంగా మాటలో పెట్టి కానిస్టేబుల్ టి.సతీష్ కాపాడిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Theft: జవహర్ నగర్లోని ఓ పెండ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ. 11 లక్షల సొత్తుతో దొంగలు ఉడాయించారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాకేత్ కాలనీ ఫేజ్ 1-16బి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.