ఉద్యోగం లేని అమ్మాయిలకు వల వేసి 60 వేల జీతం అంటూ వ్యభిచారంలోకి దింపి.. డేటింగ్ యాప్తో వ్యభిచారం చేస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
హైదరాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ బాలుడు మరణించాడు. రామంతాపూర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సనాబేగానికి భర్త, రెండు నెలల కుమారుడు ఉన్నాడు. అత్తమామలు అబ్దుల్ బాబు, ఖుమర్ బేగంతో పాటు ఆడపడుచు, మరుదులు వారి సంతానం మొత్తం దాదాపుగా పది మందితో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
రామచంద్రాపూర్ లో విషాదం జరిగింది. కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ లో స్నానానికి దిగి తండ్రి కొడుకులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో రాముడుగు మండలంలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరై స్నానానికి వెళ్లిన తండ్రి కొడుకులకు మృత్యువు కబలించింది.
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తండ్రి కన్న కొడుకునే కిడ్నాప్ చేసిన ఘటన వెలుగు చూసింది. ఈఘటన రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా కాంప్లెక్స్ లోటస్ ల్యాబ్ స్కూల్లో చోటుచేసుకుంది.
దొంగలు రెచ్చిపోతున్నారు. అదను చూసి, మాటువేసి మాయ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన దారిదోపిడీ పోలీసులకు సవాల్ విసురుతోంది. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో 10లక్షల రూపాయల దారి దోపిడీ జరిగింది. పురానాపూల్ రోడ్డులో 10 లక్షల రూపాయలతో వెళుతున్న ఓ వ్యక్తి దృష్టి మరల్చి దోపిడీకి పాల్పడ్డారు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు. ఓ బైక్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వ్యక్తి చేతిలోని 10లక్షల రూపాయల బ్యాగ్ ఎత్తుకెళ్లారు. దీంతో బహదూర్ పుర పోలీస్ స్టేషన్…
వారిద్దరూ కాలేజ్ లో స్నేహితులు.. కాలేజ్ అయిపోయాక ఇద్దరు విడిపోయారు.. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకొంటూ ఉంటుండగా సోషల్ మీడియా మళ్లీ వారిని కలిపింది. ఈసారి వారి స్నేహం.. ప్రేమాగా మారింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయిపోతే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకున్నారు. ఆ తరువాత ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం మొదలు పెట్టారు. రోజులు గడుస్తున్నా ప్రియుడు మాత్రం పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో తట్టుకోలేని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన…