Hyderabad Crime: ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను అతికిరాతకంగా దుండగులు హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. గడ్డం మహేష్ రూంలో బంధించారు. అంతే కాకుండా చిత్ర హింసలకు గురిచేస్తూ కళ్ళలో కారం చల్లారు. అనంతరం అతనిని పారతో తలపై దాడి చేయడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వారం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరంలో కలకలం రేపుతుంది.
Read also: Police Firing: సైదాబాదులో పోలీసుల కాల్పులు.. అదుపులో చైన్ స్నాచర్..
ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మాజీ ఎంపీటీసీ మహేశ్(40) ఈ నెల 17న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని సోదరుడు విఠల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఎఫ్‌సి నగర్ డంపింగ్ యార్డు వద్ద ఎన్‌ఎఫ్‌సి నగర్ డంపింగ్ యార్డులో మహేష్ మృతదేహం లభ్యమైంది. పూడ్చిన మృతదేహాన్ని స్థానిక ఎమ్మార్వో పంచనామా తర్వాత డంప్ యార్డ్ వద్దే వైద్యులు పోస్ట్ మార్టం చేశారు. కళ్ళలో కారం చల్లి, పారతో తలపై దాడి చేయడంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడని నిర్ధారించారు. డంప్ యార్డ్ లో JCB తో పెద్ద గొయ్యి తవ్వి… కారులో గడ్డం మహేష్ మృతదేహాన్ని ఉంచి కారుతో సహా పూడ్చి పెట్టినట్లు తెలిపారు. JCB తో పోలీసులు వెలికితీశారు. ఎంపీటీసీ మృత దేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున డంప్ యార్డ్ వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. విచారణలో భాగంగా పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు గడ్డం మహేశ్‌ను హత్య చేసి ఘట్‌కేసర్ డంపింగ్ యార్డులో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే మాజీ ఎంపీటీసీ మహేశ్ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మహేశ్ కుటుంబ సభ్యులకు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మహేశ్ ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
NTR : హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్.. స్టైలిష్ లుక్ అదిరిపోయిందిగా..