Asia Cup 2023: పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) ఆసియాకప్ 2023పై భారీ ఆశులు పెట్టుకుంది. ఈ ఏడాది జరగబోతున్న ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం పీసీబీ ఉన్న పరిస్థితుల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం ఇలా పాకిస్తాన్ ను వేధిస్తున్నాయి.