హుజురాబాద్ దళితభాధితుల సంగం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ఈటల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజక వర్గంలో నలుగురు చావులకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరోక్షంగా బాద్యుడు అతనిపై హత్య యత్నం కేసు నమోదు చేయాలి. కమలపూర్ మండలంలో ఉప సర్పంచ్ సుధాకర్ శిలాఫలకం ధ్వంసం చేశాడని కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీస్ స్టేషన్ నుండి విడుదల అయిన తరువాత నెలకే ఆక్సిడెంట్ లో మృతిచెందడం ఆంతర్యమేమిటి అని అన్నారు. కమలపూర్ మండలం…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకానికి ఆగస్ట్ 16న శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. హుజురాబాద్‌లో పర్యటించి మరీ… ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళిత బంధును ప్రారంభించారు. ముందుగా అర్హులైన 15 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు ముఖ్యమంత్రి. అయితే… తాజాగా దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన…
తన చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో దళిత బంధు పై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. రెండున్నర గంటలపాటు దళిత బంధుపై చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన…
కరీంనగర్ కలెక్టరేట్ చేరుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. నిన్న రాత్రి కరీంనగర్ వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడే బస చేశారు. ఇక ఇవాళ ఉదయం.. కరీంగనర్ జిల్లాలోని ఓ టీఆర్‌ఎస్ నేత కూతురి వివాహానికి హాజరయ్యారు. అక్కడ నూతన వధువరులను ఆశీర్వదించారు సీఎం కేసీఆర్. అనంతరం అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ కలెక్టరేట్ చేరుకున్నారు. ఇక కలెక్టరేట్ లో మరికాసేపట్లో దళిత బంధు పథకం పై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఇది ఇలా ఉండగా… సీఎం…
కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… నన్ను చూస్తే గజగజ వణుకుతున్నారు. నా సభలకు కరెంట్ కట్ చేస్తున్నారు. అదే నేను అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కి కరెంట్ చేస్తా అని తెలిపారు. హుజురాబాద్ ఎన్నిక వస్తేనే దళితుల మీద ప్రేమ పుట్టుకు వచ్చింది. ట్రాక్టర్లకు ఓనర్లు కాదు.. కంపెనీలకు ఓనర్లను చెయ్యాలి. అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారు. మంత్రి హోదాలో ఉండి.. తొడ గొట్టి మాట్లాడతారా. మీ కాలేజీల్లో విద్యార్థులకు…
కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మీ సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దాం. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తా. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా… అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చింది అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప…
ఇది పాదయాత్రల సీజన్. తెలంగాణలో మరో పాదయాత్రకు ముహూర్తం కుదిరింది. ఇందిరా శోభన్ తాజాగా ఈ లిస్టులో చేరిపోయారు. ఇటీవలషర్మిల పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆమె మీడియా ముందుకు వచ్చారు. తన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో వివరించారు. ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటమే ఆమె టార్గెట్. టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానలపైనే తన పోరాటమంటున్నారు ఇందిరా శోభన్. ఆమె తలపెట్టిన పాదయాత్ర పేరు ఉపాధి భరోసా…
ఆ ఒక్క ఉపఎన్నిక.. అధికారపార్టీలోని మిగతా ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోంది. క్షేత్రస్థాయిలో ఒత్తిళ్లను వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. నిధుల కోసం నియోజకవర్గం దాటి ప్రభుత్వ పెద్దల దగ్గర క్యూ కట్టక తప్పడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ ఫీట్లు.. ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చగా మారాయి. ప్రభుత్వ పెద్దల దగ్గరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ! హుజురాబాద్ ఉపఎన్నికపై టీఆర్ఎస్ పూర్తిగా ఫోకస్ పెడితే.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట వారిని ఇరుకున పెట్టే వర్గాలు…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గీతా మందిర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన గంగపుత్రుల ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సభలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గంగ పుత్రుల ఏకగ్రీవ తీర్మాణం చేసారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కి ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ. 25,116 అందజేశారు గంగ…
ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా హుజూరాబాద్ చుట్టే తిరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ విషయంలో పెద్ద సస్పెన్స్ ఏమీ లేదు ..కానీ కాంగ్రెస్‌లోనే ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ అభ్యర్థి ఎవరని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఐతే, కొండా సురేఖ పేరు ఖరారు అయిందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందటమే ఆలస్యమట. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ మూడు పేర్లతో హైకమాండ్‌కు నివేదిక…