కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బందు పథకం లబ్ధిదారుల ఎంపికకు సర్వే పూర్తి అయింది. హుజరాబాద్ నియోజకవర్గం లో ఏ ఒక్కరికి దళిత బంధు పథకం మంజూరు చేయలేదు. ఎలాంటి పుకార్లను నమ్మవద్దు. ఈ నెల 16న హుజురాబాద్ లో దళిత బందు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభము అవుతుంది అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. ప్రతి ఒక్కరికి దళిత బంధు పథకం మంజూరీ చేయబడుతుంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేక అధికారులు లబ్ధిదారుల సర్వే చేసి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసింది. అయితే లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు పుకార్లను నమ్మవద్దు. దళితులు అందరికీ దళిత బందు మంజూరు అవుతుంది అని పేర్కొన్నారు.