HYDRA :నగరంలోని నాలాలు చెత్తతో నిండిపోయి దుర్వాసన వెదజల్లడం సాధారణమైంది. శంకరపల్లిలోని బుల్కాపూర్ చెరువు నుంచి హుస్సేన్ సాగర్‌కు వరదనీరు చేరే నాలా పరిస్థితి కూడా ఇలాగే దారుణంగా ఉంది. ఎన్నిసార్లు శుభ్రం చేసినా, టన్నుల కొద్దీ చెత్త తిరిగి బయటపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో హైడ్రా ప్రత్యేక బృందాలు ఈ నాలాలను శుభ్రం చేయడంలో బిజీగా ఉన్నాయి. టోలీచౌక్ సమీపంలోని హకీంపేట ప్రాంతంలో రెండు రోజుల పాటు హైడ్రా సిబ్బంది బుల్కాపూర్ నాలాను శుభ్రం చేశారు. ఈ చర్యలతో నాలా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైడ్రా చర్యలకు ముందు నాలా ఒకలా ఉండగా, తర్వాత శుభ్రతతో కొత్త రూపం దాల్చింది.
Pawan Kalyan: పంచాయతీలు చేసి వీరమల్లు రిలీజ్ చేయాల్సి వస్తుందని అనుకోలేదు!