Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- పెళ్లైన 6నెలలకే విడాకులు
- భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
- కోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లంటే నూరేళ్ల బంధం.. కానీ ప్రస్తుత రోజుల్లో వివాహం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. పెద్దలు కుదిర్చిన వివాహం అయినా, లేదా లవ్ మ్యారేజ్ అయినా కొన్ని నెలల్లోనే మనస్పర్ధలు, అభిప్రాయ బేధాలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, ఆర్థిక సమస్యలు, చివరకు అక్రమ సంబంధాలు వంటి కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. ఇదే విధంగా ఓ జంట పెళ్లైన 6 నెలలకే డివోర్స్ తీసుకుంది.
అయితే కోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే? నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు భరణం కింద భర్త నెలకు రూ.1.35 లక్షలు ఇవ్వాలంటూ కోర్టు తీర్పు ఇవ్వడమే. ఇద్దరు ఉద్యోగులైన దంపతులు వివాహం అయి 6 నెలల్లోనే విడాకులు తీసుకోవడం, కోర్టు ఆదేశం ప్రకారం భర్త నుంచి భార్యకు నెలకు రూ.1.35 లక్షలు మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆదేశించడం వల్ల ఈ కేసు వైరల్ అయింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
పూణేకు చెందిన దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అయిన ఆరు నెలలకే ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భర్త సంపాదన నెలకు రూ.2.79,499. భార్య జీతం నెలకు 1,41,436. భర్త, తన తల్లిదండ్రుల బాధ్యత కూడా చూసుకుంటున్నాడు. తాను భర్త నుంచి విడిపోయాక జీవనం సాగించడానికి సరిపడా జీతం పొందుతున్నప్పటికీ పెళ్లైన ఆరు నెలల్లో తాను కొనసాగించిన లైఫ్ స్టైల్ ని విడాకుల తర్వాత కూడా కొనసాగించే హక్కు తనకు ఉందని, తనకు భరణం కావాలని ఆమె కోర్టు ఎదుట వాదనలు వినిపించింది. పరిగణనలోకి తీసుకున్న కోర్టు, భర్తను తన జీతంలో సగం అంటే రూ.1.35 లక్షలను ఆమెకు భరణంగా చెల్లించాలని తీర్పిచ్చింది.
ఈ కేసు వైరల్ అయిన తర్వాత నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “ఇద్దరు ఉద్యోగులైతే ఇంత భారీ మెయింటెనెన్స్ ఎందుకు?”, “అలిమనీ చట్టాలు లింగ నిష్పాక్షికంగా ఉండాలి” “పని చేసే మహిళలకు కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఫెయిర్ కాదు” అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది అలిమనీ చట్టాలు, ఆర్థిక సమానత, ఆధునిక వివాహాలలో బాధ్యతలు అనే అంశాలపై దేశవ్యాప్త చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!