సాధారణంగా ఇల్లు ఇల్లులా కట్టుకుంటే నివశించడానికి అనువుగా ఉంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా, కట్టుకుంటే, అందులో కూడా నివశించవచ్చు. కాకపోతే నివశించేందుకు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మామూలు ఇల్లు కట్టడమే చాలా కష్టం. అలాంటిది ఇంటిని తలకిందులుగా కట్టాలి అంటే చాలా కష్టం. అంతేకాదు, అందులోని వస్తువులు కూడా తలక్రిందులుగా ఉంటే… చెప్పాల్సింది ఏముంది సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఖాయమే. కొలంబియాకు చెందిన ఫ్రిట్జ్ స్కాల్ అనే పెద్దాయన ఇంటిని అందరికంటే…
ఏకాంతంగా నివశించాలని చాలా మంది కోరుకుంటారు. ఎలాంటి రణగొన ధ్వనులు లేకుండా, కాలుష్యం లేకుండా హ్యాపీగా జీవనం సాగించాలని చాలా మంది అనుకుంటారు. ఇలా అనుకునేవారు పల్లెలు, కొండ ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అయితే, అక్కడ కూడా చాలా మందికి ప్రశాంతత లభించకపోవచ్చు. ఎందుకంటే, ఎక్కడైనా సరే చుట్టూ మనుషులు కనిపిస్తుంటారు. అలా చుట్టూ మనుషులు లేకుండా నివశించాలి అంటే ఒకటి అడవిలో దూరంగా నివశించడం, లేదా సముద్రంలో ఎవరూ లేని దీవిలో ఒంటరిగా నివశించడం.…
గచ్చిబౌలి నానక్ రాంగూడలో ఓ ఘటన చోటు చేసింది. సీబీఐ అధికారులు పేరుతో… సోదాలు చేయాలంటూ ఇంటిని గుల్ల చేసారు దొంగలు. 1 కేజీల 44 గ్రాము ల బంగారంతో పాటు 2 లక్షల నగదు చోరీ చేసారు. గచ్చిబౌలి పీఎస్ పరిది నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీలో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జయభేరి ఆరెంజ్ కౌంటి ప్లాట్ నెంబర్ 110 లో ఉంటున్నారు భాగ్యలక్ష్మి. అయితే ఆ…
చంద్రునిపై క్యూబ్ రూపంలో ఉన్న ఓ ఆబ్జెక్ట్‌ను చైనాకు చెందిన యూతు 2 మూన్ రోవర్ గుర్తించింది. దూరం నుంచి మూన్ రోవర్ తీసిన ఈ ఫొటోను ఇటీవలే చైనా అంతరిక్ష సంస్థ విడుదల చేసింది. బూదరబూదరగా ఉన్న ఆ ఫొటోపై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. క్యూబ్ ఆకారంలో ఉండటంతో అది ఖచ్చితంగా ఇల్లే అయి ఉంటుందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే, కాదు, అది స్తూపం అయి ఉండొచ్చని కొందరు, కొంతమంది అది ఎలియన్…
వాన కష్టాలు మాజీ సీఎం చంద్రబాబునాయుడిని వదల్లేదు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచెత్తింది భారీ వరద నీరు. ఇంటి వెనుక పొలాలపై నుంచి వచ్చిన వరద ఇంటిని చుట్టుముట్టడంతో భద్రతా సిబ్బంది గదితో పాటు ఉద్యానవనం మునిగిపోయింది. గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోక పోవడంతో సర్పంచ్ లక్ష్మీ భర్త గిరినాయుడు, చంద్రబాబు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడు సాయంతో నీరు బయటకు పంపిస్తున్నారు.భారీవర్షం కారణంగా రేపు టీటీడీ…
సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నది. రాకెట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇతర గ్రహాలమీదకు వెళ్లేందుకు మనిషి ప్రయత్నిస్తున్నాడు. త్రీడీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చి అవసరమైన సాధనాలను తయారు చేసుకుంటున్నాడు. మనిషి ఎన్ని సాధించినా నివశించాలి అంటే ఇల్లు ఉండాలి. ఒక ఇంటిని నిర్మించాలి అంటే ఎంత సమయం, ఖర్చు అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. సమయాన్ని, ఖర్చును తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న 3డీ టెక్నాలజీని వినియోగించుకుంటున్నాడు. Read: రాష్ట్రపతికి అరుదైన గౌరవం… చీరకొంగుతో…
సొంత ఇల్లు ఉండాలని, సొంత ఇంట్లో నివశించాలని చాలా మందికి ఉంటుంది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో సొంత ఇల్లు నిర్మించుకోవడం అంటే మామూలు విషయం కాదు. నగరాలు, పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో ఇల్లు కొనుగోలు చేయాలన్నా లక్షల రూపాయలు ఖర్చుచేయాలి. ఇక, ప్రకృతి మధ్య, అందమైన బీచ్‌లు ఉన్న ప్రాంతంలో ఇల్లు కొనాలి అంటే కోట్ల రూపాయలు పెట్టాలి. కానీ, ఆ ప్రాంతంలో ఇల్లు కొనాలి అంటే కేవలం రూ.12 ఉంటే సరిపోతుంది. ఇల్లు మీ సొంతం…
ఇండియలో అది అత్యంత అరుదైన ఇల్లు. అలాంటి ఇంటిని దేశంలో మరెక్కడా చూసి ఉండరు. ఆ ఇంటి చుట్టూ రెండు దేశాల సైనికులు పహారా కాస్తుంటారు. ఇది అధికారుల అధికారిక నివాసం కాదు. సామాన్యులు నివసించే ఇల్లే. కానీ, ఈ ఇంటికి చాలా చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. తూర్పుపాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత ఇండియా.. బంగ్లాదేశ్ మధ్య ఖచ్చితమైన సరిహద్దు ఉన్నది. వేల కిలోమీటర్లమేర సరిహద్దు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో…
మనదేశంలో చిన్న ఇల్లు కట్టుకొవాలి అంటే కనీసం రూ.50 లక్షల వరకు అవుతుంది. విల్లా తీసుకోవాలి అంటే కనీసం రెండు కోట్ల వరకూ పెట్టాల్సి ఉంటుంది. అదీ అన్ని వసతులు ఉంటేనే. కానీ, ఆ ఇంటికి ఎలాంటి వసతి సౌకర్యం లేదు. కనీసం నీరు, కరెంట్, ఇంటర్నెట్ వంటి వసతులు లేవు. పైగా చుట్టుపక్కల ఆ ఒక్క ఇల్లు తప్పించి మరోక బిల్డింగ్ కనిపించదు. పచ్చని బయలు, ఎదురుగా పెద్ద కొండ, వెనుక సముద్రం. రెండు అంతస్తుల…
ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రేమలో ఉన్న గొప్పదనం తెలిస్తే అది మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఎన్ని విజయాలైనా సాధించేలా చేస్తుంది. ప్రేమ ఎప్పుడు ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓ వివాహితకు, మరో వ్యక్తికి మధ్య ప్రేమ చిగురించవచ్చు. వారి మనసులు కలిసిపోవచ్చు. చెప్పలేం. ఇలానే ఓ వివాహితతో ఓ వ్యక్తికి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను ఆ వ్యక్తి చాలా అందంగా లేఖలో ఇలా వర్ణించాడు.…