మనదేశంలో చిన్న ఇల్లు కట్టుకొవాలి అంటే కనీసం రూ.50 లక్షల వరకు అవుతుంది. విల్లా తీసుకోవాలి అంటే కనీసం రెండు కోట్ల వరకూ పెట్టాల్సి ఉంటుంది. అదీ అన్ని వసతులు ఉంటేనే. కానీ, ఆ ఇంటికి ఎలాంటి వసతి సౌకర్యం లేదు. కనీసం నీరు, కరెంట్, ఇంటర్నెట్ వంటి వసతులు లేవు. పైగా చుట్టుపక్కల ఆ ఒక్క ఇల్లు తప్పించి మరోక బిల్డింగ్ కనిపించదు. పచ్చని బయలు, ఎదురుగా పెద్ద కొండ, వెనుక సముద్రం. రెండు అంతస్తుల ఈ బిల్డింగ్ ఖరీదు అక్షరాల రూ.5 కోట్లు అంట. ఒంటరిగా ఉండాలి, పకృతిని ఆశ్వాదించాలి అనుకునే వారికి ఆ ప్రదేశం బాగా నచ్చుతుందని అంటున్నాడు ఆ ఇంటి ఓనర్ మిషెల్లే. ఈ ఇల్లు బ్రిటన్‌లోని దేవన్ లో మన్సంద్స్ సముద్ర తీరం పక్కన ఉంటుంది ఈ ఇల్లు. ఈ ఇంటి దాకా వెళ్లేందుకు రహదారి ఉండదు. కారును ఇంటికి దూరంగా పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్లాలి అంటేన్నాడు మిషెల్లే. అయితే, ఈ ఇంటికి గ్యాస్ సరఫరా సౌకర్యం ఉన్నది. వర్షం నీటిని మంచినీరుగా మార్చుకునే అవకాశం ఉండటంతో కొంతమేర సర్వైవ్ కావొచ్చని చెబుతున్నారు.
Read: ఓ ఐడియా పాత వస్తువులను ఇలా బాగుచేస్తుంది…