ఏకాంతంగా నివశించాలని చాలా మంది కోరుకుంటారు. ఎలాంటి రణగొన ధ్వనులు లేకుండా, కాలుష్యం లేకుండా హ్యాపీగా జీవనం సాగించాలని చాలా మంది అనుకుంటారు. ఇలా అనుకునేవారు పల్లెలు, కొండ ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అయితే, అక్కడ కూడా చాలా మందికి ప్రశాంతత లభించకపోవచ్చు. ఎందుకంటే, ఎక్కడైనా సరే చుట్టూ మనుషులు కనిపిస్తుంటారు. అలా చుట్టూ మనుషులు లేకుండా నివశించాలి అంటే ఒకటి అడవిలో దూరంగా నివశించడం, లేదా సముద్రంలో ఎవరూ లేని దీవిలో ఒంటరిగా నివశించడం. ఇలాంటి వారి కోసం సముద్రంలో ఓ చిన్న ఇళ్లు సిద్దంగా ఉందట.
Read: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా…
ఆ ఇంటిపేరు స్పక్‌బాంక్ ఫోర్ట్. దీనిని లండన్‌కు 125 కిమీ దూరంలో సముద్రంలో నిర్మించారు. 1875లో ఓడల రక్షణ కోసం నిర్మించారు. చిన్న లైట్ హౌస్‌తో పాటు ఉండే ఈ ఇంట్లో 9 బెడ్ రూములు, సినిమాలు చూసేందుకు ఓ రూమ్, చిన్న వైన్ రూమ్, వేటి నీటికోసం ఓ రూమ్ ఉందట. ఈ ఇంటి ఖరీదు రూ. 35 నుంచి రూ. 40 కోట్ల వరకు ఉంటుంది. ఒంటరిగా నివశించాలి అనుకునే వారికి ఈ ఇల్లు బాగా నచ్చుతుంది. అయితే, సముద్రంలో ఉంటుంది కాబట్టి ఎప్పటికే డేంజరే అని చెప్పాలి.