"చంద్రబాబు గారూ.. మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల…
గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. విచారణ తప్పదని హెచ్చరిస్తోన్న విషయం విదితమే.. అయితే, వైసీపీ హయాంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులు విషయంలో లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఈ క్రమంలోనే రాజధాని పరిధిలోని ఆర్-5 జోన్‌లో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు.
హౌసింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ రివ్యూలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్దిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.