డ్రాగన్ దేశం తన కుయుక్తులను మానడం లేదు. ఒక వైపు నమ్మిస్తూనే మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. లడఖ్ సరిహద్దు వెంబడి నిర్మాణాలను చేపడుతోంది. సైనిక సన్నద్ధతను పెంచుకుంటోంది. ఇటీవల భారత్ సరిహద్దు వెంబడి చైనా మిలిటరీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆందోళనకరమని అమెరికన్ మిలటరీ అధికారి అభివర్ణించిన తరుణంలో మరో ఘటన బయటపడింది. తూర్పు లడఖ్ ను అనుకుని ఉన్న చైనా హోటాన్ ఎయిర్ బెస్ వద్ద అత్యాధునిక పైటర్ జెట్లను మోహరిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.…