సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే…