ఇవాల్టి రోజుల్లో ఒక సినిమా హిట్ అయితే జబ్బలు చరుచుకుంటూ అంతా తమ గొప్పే అని చాటింపు వేసుకునే రోజులు ఇవి. అయితే ‘కెజిఎఫ్, కెజిఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి కూడా హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సినిమా మీద సినిమా ప్రకటిస్తూ సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నిండలే’. దీనికి మన…
హోంబలే ఫిల్మ్స్ .. ఒకప్పుడు ఈ బ్యానర్ అంటే ఏదో కొత్తది అనుకున్నారు.. కానీ కెజిఎఫ్ సినిమా రిలీజ్ అయ్యాకా హోంబాలే అంటే ఒక బ్రాండ్.. ఇక కెజిఎఫ్ 2 తో పాన్ ఇండియా మొత్తంగా హోంబలే ఫిల్మ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాకా ఈ బ్యానర్ నుంచి వస్తున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హోంబలే…
బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్.. సలార్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. పైగా కెజియఫ్‌తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కావడంతో.. సలార్ పై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే బడ్జెట్ విషయంలో.. మేకర్స్ తగ్గేదేలే అంటున్నారట. మరి సలార్ బడ్జెట్ ఎంత.. ఇప్పుడెంత పెరిగింది..? ప్రస్తుతం ప్రభాస్‌కున్న భారీ లైనప్ మరో హీరోకు లేదనే చెప్పాలి. డార్లింగ్ చేతిలో…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రబస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న విషయం విదితమే.. అందులో ఒకటి ‘సలార్’. కెజిఎఫ్ చిత్రంతో ఒన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ తరుపున శృతిహాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమా మొదలై ఇప్పటికే చాలా రోజులవుతుంది. మధ్యలో ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్ 2’ ను పూర్తిచేశాడు.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ను…
‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలూ తీవ్రంగా నిరాశపరిచాయి. కలెక్షన్ల పరంగా ‘సాహో’ పర్వాలేదనిపించినా, కంటెంట్ పరంగా మాత్రం విమర్శలు ఎదుర్కొంది. ఇక ‘రాధేశ్యామ్’ అయితే బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పతనమైంది. దీంతో.. ప్రభాస్ తదుపరి సినిమా అయిన ‘సలార్’ మీదే ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా కచ్ఛితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నారు. ఎందుకంటే, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాబట్టి! కేజీఎఫ్‌తో ఆయన ‘మాస్’కి సరికొత్త నిర్వచనం…
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘కెజిఎఫ్2’ బాక్స్ ఆఫీస్ వద్ద పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇక ఈ సినిమా ఆఖరులో దర్శకుడు ప్రశాంత్ నీల్ పార్ట్3 గురించి హింట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నాడట. ‘కెజిఎఫ్3’ ని ఈ ఏడాది చివరలో ఆరంభిస్తాడని సమాచారం. దీనిని డిసెంబర్ 2022లో లాంఛనంగా ఆరంభించబోతున్నట్లు నిర్మాత విజయ్ కిర్గందూర్ ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు. ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ ‘సాలార్’ సినిమాతో…
‘కేజీఎఫ్ 2’ సక్సెస్ ను చిత్రబృందం మొత్తం ఎంజాయ్ చేస్తోంది. ఏప్రిల్ 14న వచ్చిన ఈ సినిమా సందడి ఇంకా తగ్గనేలేదు. ‘కేజీఎఫ్’ మూవీ సృష్టించిన తుఫాన్ వల్ల డైరెక్టర్, నటీనటులతో పాటు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పేరు కూడా మారుమ్రోగిపోయింది. దీంతో హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ మూవీ ఏంటన్న విషయంపై అందరి దృష్టి పడింది. ఇటీవలే లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ఓ సినిమాను ప్రకటించిన ఈ నిర్మాణ సంస్థ తాజాగా మరో ప్రతిష్ఠాత్మక…
దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్-2’ సందడి, రాఖీ భాయ్ వయోలెన్స్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగందూర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టడంతో నిర్మాతలు మంచి ప్రాఫిట్స్ ను జేబులో వేసుకున్నారు. అంతేకాదు ‘కేజీఎఫ్’ మూవీ కారణంగా హోంబలే ఫిలిమ్స్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ నెక్స్ట్ మూవీకి…
“కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. అయితే “కేజీఎఫ్ : చాప్టర్ 2” నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మరో అడుగు ముందుకేసి, క్రికెట్ టీం ఆర్సీబీతో టీం అప్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఒకవైపు కేజీఎఫ్ : చాప్టర్ 2 మేనియా, మరోవైపు ఐపీఎల్ మేనియా… రెండూ కలిసి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్లు జరుగుతున్నాయి. అయితే తాజాగా హోంబలే…
KGF Chapter 2 ట్రైలర్ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాండల్‌వుడ్ చిత్రం KGF Chapter 2 ఏప్రిల్ 14 నుంచి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు మేకర్స్. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు బెంగళూరులో గ్రాండ్‌గా జరగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపైనే కాదు ట్రైలర్ పై కూడా…