పాన్ ఇండియా స్టార్ హీరో ప్రబస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న విషయం విదితమే.. అందులో ఒకటి ‘సలార్’. కెజిఎఫ్ చిత్రంతో ఒన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ తరుపున శృతిహాసన్ నటిస్తోంది. ఇక ఈ సినిమా మొదలై ఇప్పటికే చాలా రోజులవుతుంది. మధ్యలో ప్రశాంత్ నీల్ ‘కెజిఎఫ్ 2’ ను పూర్తిచేశాడు.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ను ముగించేశాడు. అయినా అయి సినిమా నుంచి ఒక అప్డేట్ ను కూడా ఇప్పటివరకు అభిమానులకు అందజేసింది లేదు. సినిమా నుంచు అప్డేట్ ఇవ్వకపోతే అభిమానులు చచ్చిపోతాం అని చెప్పిన ఆమెకర్స్ నిమ్మలకు నీరెత్తినట్లు ఉండడం గమనార్హం.
ఇప్పటివరకు మే చివరి వారంలో ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ కానీ, టీజర్ కానీ రిలీజ్ చేస్తారు అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి కూడా డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదట.. ‘సలార్’ టీజర్ ను ఈ నెలలో విడుదల చేయడం లేదని.. త్వరలోనే ప్రత్యేకమైన తేదీకి టీజర్ ను వదులుతామని చిత్ర వర్గాలు తెలిపినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జూన్, జూలైలో ఒక మంచి రోజు చూసుకొని టీజర్ అప్డేట్ ను అందించాలని చూస్తున్నారట మేకర్స్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఎదురుచూసింది ఈ చేదు వార్త వినడానికేనా అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ‘సలార్’ సినిమాకు సంబంధించి 30-35% షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి.. 2023 సమ్మర్ సీజన్ లో సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి వచ్చే నెలలోనైనా సలార్ అప్డేట్ ఉంటుందేమో చూడాలి.