Kantara 2 Update: సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి సంచలనంగా మారిన చిత్రం కాంతార. విడుదలైన అన్ని భాషల్లోనూ కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.400కోట్లు వసూలు చేసిన కాంతార మూవీ సీక్వెల్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాంతార సినిమా సెప్టెంబరు 30న కన్నడలో రిలీజై.. అక్టోబరు 15న తెలుగు, తమిళ్, మలయాళంతో పాటు హిందీలో విడుదలైంది. సినిమా విజయవంతం కావడంతో సీక్వెల్ కూడా తీయాలనే ప్లాన్‌లో ఆ మూవీ మేకర్స్ ‘హోంబలే ఫిల్మ్స్’ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also: Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా పడిన ధర
తాజాగా డైరెక్టర్ రిషబ్ శెట్టి కాంతార సీక్వెల్‌పై ఓ ఇంటర్వ్యూలో అప్డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే సీక్వెల్ గురించి పూర్తిగా చెప్పలేను. కానీ తప్పకుండా ఆలోచిస్తాం. ‘భూతకోళ’కి సంబంధించి చాలా సబ్ స్టోరీలు ఉన్నాయి. వాటి నుంచి ఒక దానిని సీక్వెల్‌కి స్టోరీగా తీసుకుంటాం. ‘భూతకోళ’ని మేము దైవకోలం అని పిలుస్తాం. అలా పిలవడానికి కారణం ఏంటంటే? భూతకోలా ఆడేటప్పుడు అరిచే ‘ఓ’ని మేము కేవలం శబ్ధంగా భావించడం లేదు. అదొక దైవ తీర్పులా గౌరవిస్తాం. ప్రకృతి శక్తి మొత్తం భూతకోల ఆడే వ్యక్తిలో నిండిపోతే ఎలా ఉంటుంది? అనే కోణాన్ని కాంతారాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అని సమాధానమిచ్చాడు. కాంతార సినిమా విడుదలై ఇప్పటికే 50 రోజులు దాటిపోగా.. ఇంకా చాలా థియేటర్లలో ఈ మూవీ కొనసాగుతోంది. ఓవరాల్‌గా ఇప్పటికే రూ.350 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టిన కాంతార.. ఒక్క తెలుగులోనే రూ.65 కోట్లని సాధించింది.