బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్.. సలార్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. పైగా కెజియఫ్‌తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కావడంతో.. సలార్ పై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే బడ్జెట్ విషయంలో.. మేకర్స్ తగ్గేదేలే అంటున్నారట. మరి సలార్ బడ్జెట్ ఎంత.. ఇప్పుడెంత పెరిగింది..?
ప్రస్తుతం ప్రభాస్‌కున్న భారీ లైనప్ మరో హీరోకు లేదనే చెప్పాలి. డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాలన్నీ.. భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతున్నాయి. మొత్తంగా ప్రభాస్ సినిమాల బడ్జెట్ దాదాపు 2వేల కోట్ల వరకు ఉంటుంది. ఓం రౌత్ ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. అలాగే స్పిరిట్ కూడా ఇంచు మించు ఇదే బడ్జెట్‌తో రాబోతోంది. ఇక సలార్‌ను దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా సలార్‌ను రూపొందిస్తున్నాడు.
ఇప్పటికే 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. రీసెంట్‌గానే మరో షెడ్యూల్ మొదలైంది. అయితే లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. కెజియఫ్ చాప్టర్2 తర్వాత సలార్ బడ్జెట్ భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. దీనిపై నిర్మాత విజయ్ కిర్‌గందూర్ స్పందిస్తూ.. ప్రభాస్ క్రేజ్‌కు తగినట్టుగానే.. అంచనాలను అందుకోవడానికి.. కథ, కథనాల్లో కొంత మార్పులు చేశామని.. చెప్పినట్టు వినిపిస్తోంది. అందుకే ఎక్కడ కూడా తగ్గకుండా.. 20 శాతం బడ్జెట్ పెంచినట్టు టాక్. ఆ లెక్కన సలార్‌కు అదనంగా మరో 40 కోట్లు పెరిగిందని చెప్పొచ్చు. అవసరమైతే ఇంకొంత బడ్జెట్ పెంచడానికి కూడా రెడీ ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే.. కెజయఫ్ చాప్టర్ 2 తర్వాత.. సలార్ పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అందుకే బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారట మేకర్స్. మరి భారీగా పెరిగిపోతున్న సలార్ క్రేజ్.. అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.