డిసెంబర్ నెలతో పాటు 2021 ఏడాది ముగింపునకు వచ్చింది.. కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్నాం.. అయితే, 2022 జనవరి నెలలో బ్యాంకులకు వరుసగా సెలవులు రాబోతున్నాయి… అయితే, ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు వర్తించనున్నాయి.. మొత్తంగా చూస్తే.. ఏకంగా 15 రోజులకు పైగానే సెలవులు రాబోతున్నాయి.. వరుసగా బ్యాంకు లావాదేవీలు చేసేవారు.. బ్యాంకుల చుట్టూ తిరిగేవాళ్లు.. అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. 2022 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను విడుదల చేసింది రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ).. ఆ క్యాలండర్ ప్రకారం వారాంతాలు మినహాయించి తొమ్మిది రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి..
ఇక, ఏ తేదీన ఒక్కడ ఈ సెలవులు వర్తించనున్నాయనే సంగతి గమనిస్తే.. జనవరి 1న ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్‌లలో బ్యాంకులు మూసివేయనున్నారు.. 3వ తేదీన ఐజ్వాల్, గ్యాంగ్‌టక్‌లలో బ్యాంకులు పనిచేయవు.. 4న గ్యాంగ్‌టక్‌లో, 11న మిషనరీ డే సందర్భంగా ఐజ్వాల్‌లో, 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోల్‌కతాలో, 14న సంక్రాంతి, పొంగల్ సందర్భంగా అహ్మదాబాద్, చెన్నైలలో, 15న సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్‌లలో బ్యాంకులు మూతపడనున్నాయి. 18న తైపూసం సందర్భంగా చెన్నైలో, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా అగర్తలా, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కొచ్చి, శ్రీనగర్ మినహా అన్ని నగరాల్లో బ్యాంకులకు సెలవుగా ఉంటుంది.. పై సెలవులకు తోడుగా.. జనవరి 8న రెండో శనివారం, 22న నాల్గో శనివారం.. జనవరి 2, 9, 16, 23 30 తేదీల్లో ఆదివారం కావున యథావిథిగా బ్యాంకులకు మూసివేస్తారు.