పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. దేవాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసినందుకు ఒక వ్యక్తిని సోమవారం అరెస్టు చేశారు. ఆ వ్యక్తి సాయంత్రం కరాచీలోని రాంచోర్ లైన్ ప్రాంతంలోని హిందూ దేవాలయంలోకి ప్రవేశించి హిందూ దేవత జోగ్ మాయ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేశాడు. అయితే అనంతరం నిందితుడిని ప్రజలు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. స్థానిక మీడియా సమాచారం మేరకు నిందితుడిపై దైవదూషణకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు…