రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ధ్వజమెత్తారు. మణిపూర్‌లో పరిస్థితికి రాహుల్ గాంధీ ప్రస్తుత విభేదాలను పెంచడం కంటే కరుణ అవసరమని అన్నారు.
Assam: చారిత్రాత్మక బ్రహ్మపుత్ర నది కింద భారత సైన్యం సొరంగం నిర్మిస్తుందని గతంలోనే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. ప్రతిపాదిత సొరంగం బ్రహ్మపుత్ర నది కింద మిసా నుంచి ప్రారంభమై తేజ్‌పూర్ వరకు కొనసాగుతుంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ "ఎరువుల జిహాద్" అనే కొత్త పదబంధాన్ని రూపొందించారు. ఇటీవల గౌహతిలో సహజ వ్యవసాయం అభివృద్ధి, అమలు కోసం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “మా ఎన్నికల ప్రచారంలో “ఫెర్టిలైజర్ జిహాద్” కు వ్యతిరేకంగా పోరాడాలనే సంకల్పాన్ని తాము తెలియజేశామన్నారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్రంలో మదర్సాలపై అణిచివేతను కొనసాగిస్తానని తన ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో మరో 300 మదర్సాలు మూసివేయబడతాయని గురువారం చెప్పారు.
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఇదిలా ఉంటే తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు సినిమా ప్రదర్శనను బ్యాన్ చేశాయి. పలువురు సీఎంలు, మంత్రులు ఈ సినిమాను చూస్తున్నారు.
Himanta Biswa Sarma: కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేస్తున్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు. కర్ణాటక ప్రజలకు రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇస్తున్నారు.. అయితే రాహుల్ గాంధీ గ్యారెంటీ ఎవరు తీసుకుంటారు..రాహుల్ గాంధీని నిలబెట్టేందుకు సోనియాగాంధీ గత 20 ఏళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తారా..? అంటూ ప్రశ్నించారు.
అస్సాం బిహు పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గౌహతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో ఎయిమ్స్ గువాహటిని ప్రధాని ప్రారంభించారు. ఎయిమ్స్ క్యాంపస్‌ను రూ.1,123 కోట్లతో నిర్మించారు.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఖలిస్తానీ ఉగ్రవాది నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ సంస్థ నేత అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అస్సాం జర్నలిస్టులకు బెదిరింపు కాల్ చేసి, సీఎంను బెదిరించే ప్రయత్నం చేశారు. అస్సాంలో ఖైదీలుగా ఉన్న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు హింసించబడుతున్నారని, సీఎం శర్మ జాగ్రత్తగా వినండి.. ఇది ఖలిస్తాన్ అనుకూల సిక్కులు, భారత ప్రభుత్వానికి మధ్య పోరాటం అని…