Assam CM Wife Scam : ముఖ్యమంత్రి భార్యకు రూ.10 కోట్ల సబ్సిడీ.. ఆన్ లైన్ లో ఆధారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam CM Wife Scam : అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రూ.10 కోట్ల సబ్సిడీ పొందిందన్న వార్త ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. బీజేపీ నేతలకు, వారి అనుచరులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు కనకవర్షం కురిపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
‘పీఎం కిసాన్ సంపద యోజన’ పథకం కింద అందిన సబ్సిడీతో సీఎం భార్య్ కూడిన రినికి భూయాన్ శర్మకు చెందిన కంపెనీకి రూ.10 కోట్లు అందాయి. రినికి చెందిన ప్రైడ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ నిధులు అందినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఆహార శాఖ వెబ్‌సైట్‌లోనే దీనికి సంబంధించిన సమాచారం ఉంది అంటూ అందుకు సంబంధించిన స్ర్కీన్ షార్ట్ లను ఎక్స్ లో పంచుకున్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్. ‘పీఎం కిసాన్ సంపద యోజన’ పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా చైన్‌లో ఆధునిక మౌలిక వసతులను కల్పించడం. ఇందుకోసం సబ్సిడీతో కూడిన రుణాల్ని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ శాఖ లబ్దిదారులకు అందిస్తుంది.
అయితే తన భార్య కంపెనీ రూ.10 కోట్ల సబ్సిడీ పొందిందన్న వార్తను సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. అయితే ఆన్ లైన్ లో ఉంచిన పత్రాల గురించి మాత్రం ఆయన ఏం మాట్లాడలేదు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ 2022 నవంబర్ 10న సీఎం భార్యకు సంబంధించిన కంపెనీకి రూ.10 కోట్ల సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించింది ఓ వెబ్ సైట్ పేర్కొంది. హిమంత బిశ్వ శర్మ సీఎం అయిన 9 నెలలకే ఆయన భార్య ఆ కంపెనీలో మెజారిటీ వాటా పొందరని కూడా ఆ వెబ్ సైట్ పేర్కొంది. ఇక అస్సాం రాజకీయాల్లో ఈ రగడ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!